పదవి విరమణ పొందుతున్న హోం గార్డ్ రవీందర్ కు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 33సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఈ.
రవీందర్ ను ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.
పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారు అని శుభాకాంక్షలు తెలియజేస్తు వెల్ఫ్ ఫెర్ ఫండ్ నుండి ఆర్థిక సహయంగా 10,000-/రూపాయల చెక్ అందచేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు” అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ముడ్ డిఎస్పీ గంగాధర్,ఆర్.ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ పాల్గొన్నారు.
ఈ జ్యూస్ డైట్ లో ఉంటే వెయిట్ లాస్ తో సహా అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం..!