12 సంవత్సరాల సినీ కెరీర్ లో 19 ఫ్లాపులు.. ఒకే ఒక్క హిట్ సాధించిన ఈ హీరో ఎవరో తెలుసా?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల పిల్లలకు సినిమా అవకాశాలు తొందరగా వస్తాయి.సెలబ్రిటీల ( Celebrities )పిల్లలకు సినిమాల్లో అవకాశాలకు కొదవ ఉండదు.

అందుకే బ్యాక్ గ్రౌండ్ లేని వారికి మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి కాస్త సమయం పడుతుంది.

అయితే సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ హోదా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు సెలబ్రిటీలు అయినప్పటికీ సరైన గుర్తింపు తెచ్చుకోలేని వారు చాలామంది ఉన్నారు.

అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరో కూడా ఒకరు.ఒక సూపర్ స్టార్ కొడుకు మాత్రం ఏకంగా పన్నెండేళ్లలో 19 డిజాస్టర్ సినిమాలను( 19 Disaster Movies ) తన ఖాతాలో వేసుకున్నాడు.

"""/" / ఇన్నేళ్ళలో కేవలం ఒకే ఒక్క హిట్ కొట్టినప్పటికీ, ఇంకా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నాడు.

ఇంతకీ ఆ స్టార్ కి ఎవరు? ఆయన ఏ ఏ సినిమాలో నటించాడు.

ఆ హిట్ అయిన ఆ ఒకే ఒక సినిమా ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.

అతను మరెవరో కాదు ఫర్దిన్ ఖాన్( Fardin Khan ).ఫర్దిన్ ఖాన్ దాదాపు 14 ఏళ్ల తర్వాత హీరామండి మూవీలో( Hiramandi Movie ) కీలకపాత్రను పోషిస్తున్నాడు.

ఇందులో ఆయన నవాబ్ వలీ మహమ్మద్ పాత్రలో కనిపించబోతున్నాడు.ఇతను ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ ఫిరోజ్ ఖాన్ కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఫిరోజ్ ఖాన్ వారసుడిగా ఫర్జిన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.స్వయంగా ఫర్దిన్ ఖాన్ స్వయంగా తన కొడుకు మొదటి మూవీకి దర్శకత్వం వహించాడు.

కానీ ప్రేమ్ అగ్గన్( Prem Aggan ) టైటిల్ తో రూపొందిన ఆ మూవీ ప్లాప్ గా నిలిచింది.

"""/" / అలా మొదటి మూవీనే బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడి తండ్రి కొడుకులను నిరాశకు గురిచేసింది.

అయితే ఫర్దిన్ మాత్రం సినిమా ఇండస్ట్రీపై ఆశలు వదులుకోలేదు.వరుసగా మరో 15 సినిమాలు చేశాడు.

కానీ అవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ కావడం గమనార్హం.అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేసి ఎట్టకేలకు హేయ్ బేబీ మూవీతో( Hey Baby ) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఇక ఫర్దిన్ కెరియర్ కు ఎండ్ కార్డు పడినట్టే అనుకుంటున్న సమయంలోనే ఈ మూవీ వచ్చి అతన్ని ఒడ్డున పడేసింది.

2007లో రిలీజ్ అయిన హేయ్ బేబీ మూవీలో అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ ముఖ్, విద్యాబాలన్, ఫర్దీన్ ఖాన్, అనుపమ్ కేర్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు.

దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇక ఫర్దిన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఒకే ఒక మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.

ఈ వీడియో చూస్తే.. మీ కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం..