అభిమానుల విన్నపాన్ని చరణ్ పట్టించుకుంటారా.. అలా చేస్తే గేమ్ ఛేంజర్ కు ప్లస్!
TeluguStop.com
రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన గేమ్ చేంజర్( Game Changer ) సినిమా జనవరి 10వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
అయితే ఈ సినిమా ట్రైలర్( Game Changer Trailer ) కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
"""/" /
సరిగ్గా విడుదలకు ఒక రోజు లేదా 2 రోజుల ముందు వచ్చే రిలీజ్ ట్రయిలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
విడుదలకు టైమ్ దగ్గర పడింది.మరి గేమ్ ఛేంజర్ నుంచి ఇంకో ట్రయిలర్ ఉందా లేదా? దీని కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ విడుదల అయిన విషయం తెలిసిందే.
మరొక ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ముందే రెండు ట్రైలర్లు విడుదల అవుతాయని వార్తలు వినిపించాయి.
కానీ ఇప్పటివరకు ఒక్క ట్రైలర్ మాత్రమే విడుదల అయింది. """/" /
మరి ఇంతకీ రెండవ ట్రైలర్ ఉందా లేదా ఈ విషయంపై మూవీ మేకర్స్ ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
అంతేకాకుండా ఈ సినిమా రెండో ట్రైలర్ నీ విడుదల చేస్తే ఒకింత అది సినిమాకు ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పాలి.
మరి ఈ విషయంలో అభిమానుల విన్నపాన్ని రామ్ చరణ్ పట్టించుకుంటారో లేదో చూడాలి మరి.
శంకర్( Shankar ) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇందులో అంజలి, కియారా అద్వానీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.రామ్ చరణ్ ఇందులో రెండు పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి.
తిండి గొంతుకు అడ్డుపడి ప్రాణాలు కోల్పోయిన సోషల్ మీడియా క్వీన్.. అందరూ షాక్..?