నీటిపై అల్లు అర్జున్ ఆర్ట్.. బన్నీ విషయంలో ఈ అభిమాని అభిమానానికి ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.

దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప సినిమాతో( Pushpa ) పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్.

2021 లో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

అంతేకాకుండా ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.

"""/" / ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.పుష్ప సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా అల్లూ అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.

దీంతో బన్నీకి సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా ఫ్యాన్స్‌ దానిని తెగ వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్.

తమ అభిమానాన్ని చాటుకునేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు.అల్లు అర్జున్ పై తమ అభిమానాన్ని చూపడంలో తగ్గేదే లే అన్నట్లు అప్పుడప్పుడు ప్రవర్తిస్తుంటారు.

"""/" / తాజాగా ఒక ఆర్టిస్ట్ నీటిపై వేసిన బన్నీ ఆర్ట్ సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతోంది.

Dhrisha_suroiwal అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో పళ్లెంలో ఉన్న నీటిపై రంగులతో ఒక ఆర్టిస్ట్ అల్లు అర్జున్ బొమ్మను వేయడం కనిపించింది.

బొమ్మ మొత్తం పూర్తయ్యాక పుష్ప సినిమాలో మెడపై చేయి పెట్టి తగ్గేదేలే అంటూ బన్నీ పెట్టిన ఫోజు కనిపించింది.

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.బొమ్మ వేసిన ఆర్టిస్టు టాలెంట్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.

ఓరి దేవుడా మీ టాలెంట్ వేరే లెవెల్ అంటున్నారు.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)