మరీ అంచనాలు పెంచకండి బాసు..!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రెస్ మీట్ రీసెంట్ గా జరిగింది.
ఈ ప్రెస్ మీట్ లో సినిమాపై అంచనాలు పెంచడమే పనిగా పెట్టుకున్నారు చిత్రయూనిట్.
రాసి పెట్టుకోండి మెగా ఫ్యాన్స్ కి ఈ పండుగకి ఫుల్ మీల్స్ పక్కా.
పూనకాలు లోడింగ్ లాంటి కామెంట్స్ డైరెక్టర్ బాబీ చెప్పాడు.సినిమా ఆ రేంజ్ లో ఉంటే పర్వాలేదు కానీ సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గినా ఈ కామెంట్స్ మళ్లీ రివర్స్ లో తగిలే ఛాన్స్ ఉంది.
ఇదివరకు చిరు సినిమాలకు కూడా ఇలాంటి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
అసలే ఆచార్య, గాడ్ ఫాదర్ రెండు వరుస ఫ్లాపులతో మెగా ఫ్యాన్స్ అప్సెట్ లో ఉండగా వాల్తేరు వీరయ్య తప్పకుండా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు సాధ్యమైనంతవరకు అంచనాలు పెంచకుండా సినిమా ని ప్రమోట్ చేస్తే థియేటర్ కి వచ్చిన ఆడియన్ సర్ ప్రైజ్ అయితే అప్పుడు అది సంచలనాలు సృష్టిస్తుందని అంటున్నారు.
అలా కాకుండా అంచనాలు పెంచేలా మాట్లాడి సినిమా చూశాక నిరాశ పడితే మాత్రం ఫ్యాన్స్ మళ్లీ షాక్ అయ్యే అవకాశం ఉంటుంది.
దోతీ కట్టుకోవడం నచ్చక సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు