చైతన్య, సమంతలకు ఫ్యాన్స్ విజ్ఞప్తి ఇదే.. అలా చేస్తే తప్పేంటని అడుగుతూ?

ఒకరినొకరు అమితంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో చైతన్య సమంత జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

కలకాలం చైతన్య సమంత సంతోషంగా ఉంటారని ఫ్యాన్స్ భావించగా ఎవరూ ఊహించని విధంగా వీళ్లిద్దరూ విడిపోయారు.

సమంత చైతన్య విడిపోయినట్టు చేసిన ప్రకటన చాలామంది సినిమా సెలబ్రిటీలను సైతం షాక్ కు గురి చేసింది.

చైతన్య, సమంత అభిమానులు సమంత చేసిన ప్రకటన వల్ల హర్ట్ అయ్యారు.నెటిజన్లలో చాలామంది సమంతచైతన్యల విడాకుల గురించి ఎవరికి తోచిన విధంగా వాళ్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే విడిపోయిన సమయంలో సమంత, చైతన్య తాము విడిపోయినా మంచి స్నేహితులలా ఉంటామని చెప్పారు.

అందువల్ల భవిష్యత్తులో కలిసి నటించే ఛాన్స్ వస్తే చైతన్య, సమంత వదులుకోకూడని ఫ్యాన్స్ సూచనలు చేస్తారు.

భవిష్యత్తులో సైతం ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. """/"/ మరి కొందరు అభిమానులు మాత్రం ఏకంగా సమంత, చైతన్య విడిపోయినట్లు ప్రకటన చేసినా భవిష్యత్తులో మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు చేయడం గమనార్హం.

చైతన్య, సమంత కలిసి నటించిన సినిమాల్లో ఆటో నగర్ సూర్య మినహా మిగిలిన అన్ని సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

సమంత నటించిన ఓ బేబీ సినిమాలో చైతన్య గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించారు.

"""/"/ చైతన్య, సమంత విడాకుల వల్ల అక్కినేని అభిమానులు మాత్రం హర్ట్ అయ్యారు.

ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సమంత, చైతన్య విడాకులు తీసుకోవడానికి గల కారణాల గురించి సమాధానం చెప్పక తప్పదనే చెప్పాలి.

ఫ్యాన్స్ విజ్ఞప్తిని చైతన్య సమంత పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ కాగా చైతన్య మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.

దర్శకుడు హరీష్ శంకర్ పై పెరుగుతున్న ఒత్తిడి.. ఉస్తాద్ తో లక్ష్యాన్ని సాధిస్తాడా?