పుష్ప సినిమాకు పార్ట్3 నిజంగా అవసరమా.. అభిమానుల రియాక్షన్ మాత్రం ఇదే!
TeluguStop.com
కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
ఈ సినిమాలకు సీక్వెల్ గా కేజీఎఫ్3( KGF 3 ) తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
ఇక్కడ కేజీఎఫ్3 సినిమాకు నిజంగానే స్కోప్ ఉంది.పుష్ప1, పుష్ప2 సినిమాలు హిట్టైనా పుష్ప సినిమాకు పార్ట్3( Pushpa 3 ) నిజంగా అవసరమా అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాలోనే కథ లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండగా పుష్ప ది ర్యాంపేజ్( Pushpa The Rampage ) ను కూడా ఇలానే నడిపిస్తే ఎలా అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
పుష్ప ఫ్రాంఛైజ్ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వొచ్చేమో కానీ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతాయని మాత్రం చెప్పలేము.
పుష్ప ది రూల్ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ సైతం మరీ అద్భుతంగా అయితే లేదు.
"""/" /
పుష్ప ది ర్యాంపేజ్ థియేటర్లలోకి రావడానికి మరో 5 సంవత్సరాల సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సుకుమార్( Sukumar ) సినిమాలలో పుష్ప ది రూల్ వీక్ స్క్రిప్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సుకుమార్ ఈ నెగిటివ్ కామెంట్ల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి రీషూట్లు ఎక్కువగానే చేశారని సమాచారం అందుతోంది.
"""/" /
పుష్ప ది రూల్ మూవీ బడ్జెట్ ఏకంగా 700 కోట్ల రూపాయలు కాగా బన్నీ రెమ్యునరేషన్ వల్లే ఈ సినిమా బడ్జెట్ ఈ స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం కాగా ఓటీటీలో సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాల్సి ఉంది.
బన్నీ బ్రాండ్ వాల్యూను మాత్రం ఈ సినిమా పెంచేసిందనే చెప్పాలి.డైరెక్టర్ సుకుమార్ ఫస్ట్ మూవీ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనుంది.
బుల్లితెరపై డిజాస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీ.. రేటింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!