మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన ఈ పనికి ఫ్యాన్స్ ఫిదా.. ఏం చేసాడంటే?

సంగీతాభిమానులకు పరిచయం అక్కర లేని పేరు ఎస్.ఎస్.

థమన్.తనదైన సరికొత్త రీఫ్రెష్ మ్యూజిక్ తో తెలుగు టాప్ హీరోస్ సినిమాలకు సంగీతం అందించిన థమన్ ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

అయితే వకీల్ సాబ్ సినిమాకు అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఒక్కసారిగా సినిమా ప్రేక్షకులను ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసాడని చెప్పవచ్చు.

థమన్ లో ఉన్న గొప్ప లక్షణం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం థమన్ ను ఇప్పుడు ఇంతటి స్థాయిలో ఉంచిందని చెబుతారు.

తాజాగా థమన్ చేసిన ఓ పనికి నెటిజన్లు, ఫ్యాన్స్ థమన్ కు సలాం చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే కరోనా బారిన పడి థమన్ కీ బోర్డు ప్లేయర్ కమల్ కుమార్ మృతి చెందారు.

థమన్ దగ్గర పని చేసే వ్యక్తి కావడంతో కమల్ కుమార్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ఆ సదరు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటానని భరోసా ఇవ్వడంతో పాటు, కమల్ కుమార్ కొడుకును సైతం తన స్వంత ఖర్చులతో చదివిస్తానని చెప్పి తన గొప్ప మనసును చాటుకున్నాడు ఎస్.

ఎస్.థమన్ ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

సినిమా అభిమానులు థమన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా థమన్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమనే చెప్పాలి.

ఎన్టీఆర్ చేసిన ఈ సహాయాల గురించి ఏ మీడియాకు తెలియదు ?