ఫ్యాన్స్‌కు చిరాకు తెప్పిస్తున్న కళ్యాణ్‌ రామ్‌

నందమూరి ఫ్యామిలీ నుండి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం దాటి పోయింది.

కాని ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఒక్కటి కూడా లేదు.

ఒకటి రెండు సినిమాలు సక్సెస్‌ను దక్కించుకున్నా అవి అప్పట్లో పెద్దగా వసూళ్లను రాబట్టడంలో సక్సెస్‌ కాలేదు.

కమర్షియల్‌ సక్సెస్‌ కోసం పరితపిస్తున్న కళ్యాణ్‌ రామ్‌ తమ్ముడి సాయంను కూడా తీసుకుంటున్నాడు.

తన సినిమాల వేడుకలకు మరియు ఇతరత్ర కార్యక్రమాలకు ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తూ పబ్లిసిటీ పొందుతున్నాడు.

కాని అది కళ్యాణ్‌ రామ్‌కు ఉపయోగపడటం లేదు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తాజాగా కళ్యాణ్‌ రామ్‌ ‘నానువ్వే’ అనే చిత్రంలో నటించాడు.

జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో కాస్త అంచనాలున్నాయి.

దాంతో సినిమాను వారు ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ మరియు టీజర్‌లు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి.

తప్పకుండా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు.మొదట ‘నానువ్వే’ చిత్రాన్ని ఎమ్మెల్యే కంటే ముందే విడుదల చేస్తామన్నారు.

కాని కొన్ని కారణాల వల్ల కళ్యాణ్‌ రామ్‌ ఎమ్మెల్యే చిత్రాన్ని మొదట విడుదల చేశారు.

అప్పటి నుండి కూడా నానువ్వే చిత్రాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

!--nextpage మొన్నటి వరకు ఈనెల 25న అంటే నిన్న విడుదల చేస్తామని చెబుతూ వచ్చారు.

చివరి నిమిషంలో సినిమాను జూన్‌ 1న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.నానువ్వే చిత్రం విడుదల తేదీ ప్రకటించిన తర్వాత జూన్‌ 1న పెద్ద చిన్న చిత్రాలు చాలా విడుదల కాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

ఆఫీసర్‌ చిత్రం కూడా అదే తేదీన రాబోతుంది.ఇంకా పలు చిత్రాలు కూడా జూన్‌ 1న విడుదలకు సిద్దం అవుతున్నాయి.

దాంతో నానువ్వే చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.సినిమాను సేఫ్‌ జోన్‌లో విడుద చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు వాయిదాల మీద వాయిదాలు వేయడంతో ప్రేక్షకుల్లో అసంతృప్తితో పాటు అనుమానాలు పెరుగుతున్నాయి.

సినిమాపై వారికే నమ్మకం లేదేమో, అందుకే సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు.

సినిమాలో కంటెంట్‌ ఉంటే ఖచ్చితంగా ఎంత పోటీ ఉన్నా మంచి కలెక్షన్స్‌ను రాబడుతుంది.

కాని ఈ చిత్రంలో కంటెంట్‌ లేదేమో అందుకే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉన్నారు అంటూ ఫ్యాన్స్‌ చిరాకు పడుతున్నారు.

నందమూరి హీరో ఫ్యామిలీ చిత్రానికి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కళ్యాణ్‌ రామ్‌ అలసత్వం కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయని ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఉన్నారు.అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం సినిమా ఎప్పుడు విడుదలైనా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.