‘యానిమల్’ ఫస్ట్ లుక్ తో రష్మికపై ఫోకస్.. మూడోసారైనా హిట్ దక్కేనా?

బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ''యానిమల్'' ఒకటి.

ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ ఫ్యాన్స్ లో చాలా మంది ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తెరకెక్కించడం వల్ల టాలీవుడ్ లో కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

'యానిమల్' సినిమాలో హీరోగా రణబీర్ కపూర్ నటిస్తుండగా హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే రణబీర్ కపూర్ రోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రాగా ఇటీవలే రష్మిక మందన్న ఫస్ట్ లుక్( Rashmika Mandanna ) ను రిలీజ్ చేసారు.

అమ్మడి ఫస్ట్ లుక్ ఆమె ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.సింపుల్ అండ్ హోమ్లీ లుక్ లో ఆకట్టుకోగా ఈ భామ కెరీర్ గురించి ఆమె ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.

ఎందుకంటే ఈమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. """/" / పుష్ప సినిమా( Pushpa ) తర్వాత అమ్మడికి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వరించాయి.

దీంతో అక్కడ కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంది.టాలీవుడ్ లో ఓకే.

కానీ బాలీవుడ్ లో, కోలీవుడ్ లో అమ్మడు చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి.

కోలీవుడ్ లో సుల్తాన్, వారిసు సినిమాలతో అలరించిన ఈమెకు మరో ఆఫర్ దక్కలేదు.

ఇక బాలీవుడ్ లో రిలీజ్ అయిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. """/" / గుడ్ బై, మిషన్ మజ్ను అంతగా అలరించలేక పోయాయి.

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈమె బాలీవుడ్ సినిమా రిలీజ్ కాబోతుంది.యానిమల్ సినిమాతో ఈమె మరోసారి హిందీ ప్రేక్షకులను పలకరించబోతుంది.

అయితే ఈసారి మన టాలీవుడ్ డైరెక్టర్ తీస్తున్న సినిమా కావడంతో ఈమెకు హిట్ దక్కుతుంది అని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.

మరి ఇదైనా అమ్మడికి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.మిగిలిన భాషల్లో ఎలా ఉన్న టాలీవుడ్ మీద మాత్రం ఈమె చాలా నమ్మకం పెట్టుకుంది.

ఇది బెడిసి కొట్టిన పుష్ప 2 తో మరోసారి హిట్ అందుకోవడం ఖాయం.

ఈ వారం రిలీజ్ కానున్న క్రేజీ ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే.. కల్కి వల్లే అలా జరిగిందా?