హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ పై ఫ్యాన్స్ ఫైర్.. రెండో టీ20 మ్యాచ్లో పేలవ ప్రదర్శన..!

భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్( T20 Match ) లో భారత్ పేలవ ఆట ప్రదర్శన చేసి ఘోర ఓటమిని ఖాతాలో వేసుకుంది.

తొలి టీ 20 మ్యాచ్లో ప్రదర్శించిన ఆటనే మళ్లీ ప్రదర్శించడంతో క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

ఇక భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Captain Hardik Pandya ) చెత్త నిర్ణయాలపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 150 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత జట్టు బ్యాటర్లలో ఒక్క తిలక్ వర్మ మాత్రమే 51 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

జట్టులో ఉండే మిగతా బ్యాటర్లంతా పేలవ ఆటను ప్రదర్శించి ఘోరంగా విఫలమయ్యారు. """/" / భారత్ చేజింగ్ లో హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ లో ఏకంగా రెండు వికెట్లు తీసి మంచి శుభారంభం అందించాడు.

అయితే 16వ ఓవర్ వేసిన చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.హెట్మెయార్( Hetmeyer ) (22), జేసన్ హోల్డర్ (0)లను అవుట్ చేశాడు.

చాహల్ బంతిని ఎదుర్కోవడంలో విండీస్ బ్యాటర్లు ఎంతో కష్టపడ్డారు.ఈ 16వ ఓవర్ లోనే ఒక రన్ అవుట్ కూడా జరిగింది.

"""/" / ఆ తర్వాత మళ్లీ చాహల్ కు బంతి ఇవ్వలేదు.ఏ కెప్టెన్ అయినా మళ్లీ ఇలాంటి బౌలర్ కు మళ్లీ బంతి ఇస్తాడు.

కానీ హార్థిక్ పాండ్యా మాత్రం ఎందుకు చాహల్ కు బంతి ఇవ్వలేదో ఎవరికి అర్థం కాలేదు.

మరోసారి చాహల్( Chahal ) చేతికి బంతి ఇచ్చి ఉంటే ఆట మరోలా ఉండే అవకాశం ఉండేది.

హార్థిక్ పాండ్యా చెత్త నిర్ణయాలపై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.చివర్లో అల్జరీ జోసెఫ్ 10 నాట్ అవుట్, అకీల్ హుస్సేన్ 16 నాట్ అవుట్ గా నిలిచి మ్యాచ్ ను లాంఛనంగా పూర్తి చేసి విండీస్ ఖాతాలో రెండో విజయాన్ని చేర్చారు.

కంగువా తో సూర్య సక్సెస్ సాధించాడా..?