Naga Chaitanya: వైరల్ అవుతున్న అక్కినేని ఫ్యామిలీ ఫోటో.. చైతూని అలా చూసి తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి( Akkineni Family ) మంచి గౌరవం, హోదా ఉన్న సంగతి తెలిసిందే.

సీనియర్ స్టార్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నుండి తన వారసుల వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు బ్రతికుండగానే నాగార్జున( Nagarjuna ) స్టార్ హీరోగా అయ్యి తండ్రికి మంచి గౌరవాన్ని తీసుకొని వచ్చాడు.

నాగార్జునకు మాత్రం తన వారసుల నుండి అంత అదృష్టం రాలేకపోతుంది.తన ఇద్దరు కొడుకులైనా నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హోదా కోసం తెగ ఆరాటపడుతున్నారు.

ఇప్పటివరకు వీరిద్దరూ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్న సినిమాలైతే ఏమీ లేవని చెప్పాలి.

కొంతవరకు నాగచైతన్య( Naga Chaitanya ) పరవాలేదు అన్నట్టుగా సినిమాలు చేస్తున్నాడు కానీ అఖిల్ కు మాత్రం మొదటినుంచి సక్సెస్ లేకపోయింది.

ఇక నాగార్జునకు ఇద్దరు భార్యలన్న సంగతి అందరికీ తెలిసిందే.1984లో నాగార్జున దగ్గుపాటి లక్ష్మిని( Daggubati Lakshmi ) కుటుంబ సమక్షంలో పెళ్లి వివాహం చేసుకున్నాడు.

ఇక వీరిద్దరికీ నాగచైతన్య జన్మించాడు.అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 1990లో విడాకులు తీసుకున్నారు.

ఇక అప్పటినుంచి నాగచైతన్య ఒకేసారి అందుకోవాల్సిన తల్లి తండ్రి ప్రేమను కోల్పోయాడు.ఇక కొన్ని రోజులు నాగార్జున దగ్గర ఉంటే మరికొన్ని రోజులు లక్ష్మీ దగ్గర ఉండేవాడు.

ఇప్పటికీ అలాగే ఉంటున్నాడు. """/" / అయితే లక్ష్మితో విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున తనతో కలిసి నటించిన నటి అమలను( Amala ) ప్రేమించి 1992లో వివాహం చేసుకోగా వారికి అఖిల్ జన్మించాడు.

ఇక అఖిల్( Akhil ) పుట్టిన సంవత్సరానికే సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు నాగర్జున.

నాగచైతన్య మాత్రం కొంత వయసు వచ్చాకే సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.అమల కూడా అఖిల్ విషయంలో బాగా కేరింగ్ తీసుకుంటుంది.

కానీ నాగచైతన్య విషయంలో అంత కేరింగ్ తీసుకున్నట్లు ఏ రోజు కూడా అనిపించలేదు.

ఇక చైతన్య కూడా తనతో ఎక్కువగా మూవ్ అయినట్లు ఎప్పుడు బయటపడలేదు.చాలా సార్లు తల్లి లక్ష్మితో కలిసి దిగిన ఫోటోలు, తనతో కలిసి ఉన్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.

"""/" / అయితే నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో కూడా అమల పాత్ర ఉంది అని చాలా వార్తలొచ్చాయి.

అఖిల్ నిశ్చితార్థం( Akhil Engagement ) క్యాన్సిల్ అయినందుకు నాగచైతన్య, సమంత( Samantha ) మధ్యలో గొడవలు రాజేసిందని జోరుగా వార్తలైతే వచ్చాయి.

కానీ అసలు ఏం జరిగిందో అనే విషయం మాత్రం ఎవరికీ ఇంకా తెలియ రాలేదు.

అయితే ఇదంతా పక్కన పెడితే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఒకప్పటి ఫోటో బాగా వైరల్ అవుతుంది.

"""/" / అందులో నాగచైతన్య తన తల్లిదండ్రులతో పాటు భార్య పిల్లలతో ఉన్నాడు.

నాగేశ్వరరావు, నాగార్జున నిలబడి ఉండగా సోఫాలో అమల, తన అత్తగారు, అఖిల్, చైతన్య కూర్చోని ఉన్నారు.

అయితే ఆ ఫోటోలో నాగచైతన్య ఫేస్ కాస్త డల్ గా ఉండగా ఆయనను అలా చూసి తన ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

కారణం ఏంటంటే అందులో తన తల్లిని మిస్ అయ్యాడు కాబట్టి.తన ఫేస్ లో ఆ బాధ కూడా కనిపిస్తుంది.

దీంతో ఆ ఫోటో చూసి కొందరు నాగార్జునని ఏకిపారేస్తున్నారు.నాగచైతన్యని ఒంటరి వాడిని చేశారు పాపం.

ముఖంలో ఆనందం లేదు.ఎంతైనా సొంత తల్లితో ఉంటే ఆ ప్రేమ వేరు.

వీళ్ళ కామనికి పిల్లలని బలి చేస్తున్నారు అంటూ నాగార్జున పై కోపంతో కామెంట్లు చేస్తున్నారు.

హార్వర్డ్ కుబేరుల వికృత చేష్టలు.. డబ్బును ఇలాగే తగలేస్తారా.. వీడియో లీక్!