‘గేమ్ ఛేంజర్’ విషయంలో హర్ట్ అవుతున్న ఫ్యాన్స్.. పట్టించుకోని మేకర్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ''గేమ్ ఛేంజర్'' ( Game Changer )ఒకటి.

ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియన్ మూవీతో ఎంతో స్టార్ డమ్ అందుకున్న చరణ్ వెంటనే సినిమాను అయితే స్టార్ట్ చేసాడు కానీ ఆ సినిమాను ప్రోపర్ గా ప్రేక్షకుల ముందుకు తేలేక పోతున్నారు.

స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ కాంబోపై ఎంత ఎగ్జైట్ మెంట్ ఉందో అంతే నిరాశ నెలకొంది.

అందుకు కారణం చాలా మందికి విదితమే.ఈ సినిమా స్టార్టింగ్ లో జెట్ స్పీడ్ గా పూర్తి చేసారు.

దాదాపు 70 శాతం షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది.కానీ గత ఆరు నెలలుగా ఈ సినిమా మిగిలిన భాగాన్ని పూర్తి చేయలేక పోయారు.

దీంతో మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. """/" / అంతేకాదు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఇక ఫ్యాన్స్ లో ఉన్న సహనం కాస్త పూర్తిగా నశించిపోయింది.

ఈ సినిమా కంటే వెనుక స్టార్ట్ చేసిన పాన్ ఇండియన్ సినిమాల నుండి వరుస అప్డేట్ లను ఇస్తూ షూటింగ్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ అప్డేట్స్ ఇస్తుంటే శంకర్( Director Shankar ) కానీ చరణ్ కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు.

"""/" / దీంతో ఈ సినిమాపై ఇప్పటికి ఎలాంటి బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు.

అందుకే గేమ్ ఛేంజర్ విషయంలో మేకర్స్ హర్ట్ అవుతున్నారు.ఎలాంటి అప్డేట్ లేదు.

ఇంకా రిలీజ్ డేట్ కూడా ప్రకటించక పోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు.మరి వీరి కోరిక ప్రకారం ఏదైనా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి.

కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

బిస్లరీ సంస్థను అమ్ముకుందామనుకున్న ఫౌండర్.. ఆయన కూతురు రంగంలోకి దిగడంతో..?