పవన్ మహావృక్షం.. ఆయనకు సపోర్ట్ అక్కర్లేదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
మెగా బ్రదర్ నాగబాబు( Nagendra Babu ) గురించి మనందరికి తెలిసిందే.
నాగబాబు ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు.
కాగా నాగబాబు అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.కానీ ఈ మధ్యకాలంలో ఆయన అభిమానులతో ముచ్చటించక చాలా రోజులు అయింది.
తాజాగా కొంచెం గ్యాప్ తర్వాత నాగబాబు ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. """/" /
ఈ నేపథ్యంలోనే అభిమానులు అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇలా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రశ్నలు నాగబాబుకి ఎక్కువ ఎదురయ్యాయి.
పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )గురించి ఒక్కమాటలో? చెప్పండి అని అడగగా.
కొణిదెల పవన్ కల్యాణ్ అంటూ సమాధానం ఇచ్చారు.పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారుు కదా? సినిమాలు కంటిన్యూ చేస్తారా? లేదా? అని అడగగాఅదీ ఉండాలి.
దాంతో పాటు ఇదీ ఉండాలి అని తెలిపారు.మీరు ఎంపీ లేదా ఎమ్మెల్యే అవుతారనుకున్నాము అని ప్రశ్నించగా.
"""/" /
సరే సర్లే.అన్ని జరుగుతాయా ఏంటి అంటూ బాలయ్య బాబు ( Nandamuri Balakrishna )డైలాగ్ చెప్పారు.
లావణ్య గురించి ఒక్కమాటలో? చెప్పండి అనగా.వినయం, మంచి మనసు ఉన్న మనిషి అని తెలిపారు.
పవన్ కల్యాణ్‌కు సపోర్ట్‌గా ఉన్నందుకు థ్యాంక్యూ? అనగా ఒక మహావృక్షానికి సపోర్ట్ అవసరమా? అని సమాధానం ఇచ్చారు నాగబాబు.
కాగా ఈ సందర్బంగా నాగ బాబు చెప్పిన సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారత్‌పై ఆంక్షల దిశగా కెనడా.. మద్ధతు పలికిన భారత సంతతి నేత !!