సిల్క్ స్మిత తో తమిళ ఫ్యాన్స్ అభిమానుల వింత ప్రవర్తన

మామూలుగా తెర పైన నటించే నటీనటులన్నా, హీరోయిన్స్ పైన, లేదంటే హీరోల పైన అభిమానం ఎంతవరకు ఉంటుంది చెప్పండి.

మహా అయితే వారు కనిపిస్తే వెళ్లి పక్కనే నిలబడి ఫోటో తీసుకుంటాం, సెల్ఫీ అడుగుతాం లేదంటే ఆటోగ్రాఫ్ తీసుకుంటాం.

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది కానీ ఈ అన్ని పరిస్థితులకు భిన్నంగా ఉండేది సిల్క్ స్మిత అభిమానుల ప్రవర్తన.

చాలా మందికి ఆమె ఒక అందాల దేవతే కాదు శృంగార దేవత.ఆమెను తలుచుకొని నిద్రపోయే వాళ్ళు వేళల్లో ఉండేవారు.

ఆమె కనిపిస్తే చాలు సిల్క్ మత్తు కళ్ళతో మాయ చేసినట్టుగా అందరూ ఆ మత్తులో తూగిపోయేవారు.

ఇక ఇప్పుడు ఫాన్స్ అభిమానం అయితే సోషల్ మీడియాలో పిచ్చిగా ఉంటుంది కానీ 80 లలో అభిమానులు అందరూ కూడా సిల్క్ స్మితతో విచిత్రంగా ప్రవర్తించేవారు.

ముఖ్యంగా తమిళ ఫాన్స్ గురించి ఖచ్చితం గా చెప్పుకోవాలి.ఆమె షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో కొత్తగా కిల్లి దుకాణాలు వెలిసేవి.

ఎందుకంటే ఆమె అభిమానులు కిల్లీలు తీసుకొని వెళ్లి ఆమెతో కొరికించుకొని తీసుకెళ్లేవారు.అలా కిల్లిని కొరికి ఇమ్మని బతిమిలాడడం అప్పట్లో ఒక పెద్ద ట్రెండ్ అనే చెప్పాలి.

ఇక ఇక్కడ మరొక వింత విషయం చెప్పాల్సిందే.1984లో ఒక షూటింగ్ జరుగుతోంది అందులో సిల్క్ స్మిత పాల్గొంది ఆమె ఆ సమయంలో ఆపిల్ తింటోంది.

ఆమె ఒక్కసారి యాపిల్ కోరకగానే షార్ట్ రెడీ అని వినిపించింది.దాంతో తింటున్న ఆపిల్ ని పక్కన పెట్టి అలాగే వదిలేసి వెళ్ళిపోయింది.

"""/"/ అయితే ఆ సినిమాలో పని చేసే మేకప్ మ్యాన్ సిల్క్ స్మిత కొరికిన ఆ ఆపిల్ ని అక్కడే వేలం పాట వేశాడు.

ఆ సెట్లో ఉన్న వారంతా కూడా ఆమె కొరికిన ఆపిల్ కోసం పోటీపడ్డారు.

40 ఏళ్ల క్రితం ఆమె కోరిక ఆ ఆపిల్ కాయ 26 వేలకు అమ్ముడుపోవడం అంటే ఎంతటి అభిమానం సంపాదించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ఆమె అనేక మంది నిర్మాతలకు కల్ప వృక్షం.షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు నోచుకోని సినిమాలను ఒకా సిల్క్ స్మిత పాత జోడించి కోట్లు కలెక్షన్స్ సంపాదించేవారు.

సిల్క్ స్మిత పాట ఉన్న సినిమా అంటే అప్పట్లో బయ్యర్లు కూడా కొనడానికి ఎగబడేవారు.

Bet Us Payment Methods And Account Access (UK)