'ఫ్యాను' గాలి బలంగానే వీస్తోందా...?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది.ప్రస్తుతం పోటీ వాతావరణంలో ఈ విధంగా ముందుకు వెళ్తే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు అనే భావనలో ఉంది.

ఇప్పటికే.ఏపీలో ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనే విషయంలో స్పష్టమైన క్లారిటీతో ఇప్పటికే ఒక లిస్ట్ తయారు చేసుకుంది.

ఒకపక్క 13 జిల్లాల్లో ఏ పరిస్థితి ఉంది అనే విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు.

దీనికి తోడు తమ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ద్వారా అన్నిరకాల రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు.

దాని ద్వారా ఎక్కడెక్కడ ఏ ఏ నాయకులను ప్రోత్సహించాలి.? ఏ నాయకులను వదిలించుకోవాలి అనే విషయంలో క్లారిటీ కి వస్తున్నాడు జగన్.

ఇప్పుడు మాత్రం టికెట్ల కేటాయింపు విషయంలో కార్యకర్తల అభిప్రాయం .మెజార్టీ నాయకులు సూచిన వ్యక్తులను పరిగణలోకి తీసుకోవాలని చూస్తున్నాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే ఇప్పటికే.130 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఖరారారయినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే వీరి ఎంపికలో వారి వారి బలా బలాలు ఎలా ఉన్నా.పెద్దగా పట్టించుకోవడం లేదు.

జగన్ ఇమేజ్ మీద ఆధారపడే అందరూ గెలుస్తారనే బలమైన విశ్వాసం పార్టీలో ఏర్పడింది.

అందువల్లనే అభ్యర్థులకు షరతులు వర్తింపచేస్తున్నారు.క్యాండిడేట్లతో సంబంధం లేకుండా పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందనే విషయాన్నే కార్యకర్తల సమావేశాల్లో వివరిస్తున్నారు.

ముఖ్యంగా తమ పార్టీకి బాగా పట్టున్న రాయలసీమలో మెజార్టీ స్థానాలు గెలుచుకోగలిగితే సీటు తమదే అన్న కోణంలో వైసీపీ అధినేత ఉన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గతంలో అనంతపురం నుంచి ప్రకాశం వరకూ ఉన్న మెట్ట జిల్లాల్లో అనంతపురం మాత్రమే టీడీపీకి అండగా నిలిచింది.

మిగిలిన జిల్లాల్లో వైసీపీదే ఆధిక్యత కనిపించింది.ఈ సారి టీడీపీ మరింతగా దెబ్బతింటుందని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు.

ఈ జిల్లాల్లో టీడీపీ కంటే 25 సీట్ల కచ్చితమైన ఆధిక్యం వైసీపీకి లభిస్తుందని సొంత సర్వేల ఆధారంగా నిర్ధరణకు వచ్చేశారు.

టీడీపీకి ఈ ఆరు జిల్లాల్లో కలిసి 23 నుంచి 25 స్థానాలు మాత్రమే దక్కుతాయని అగ్రనాయకులు వివిధ సమావేశాల్లో పార్టీ క్యాడర్ కు ధైర్యం నూరిపోస్తున్నారు.

ఇక ఉత్తరాంధ్ర , గోదావరి జిల్లాల్లో పార్టీ పరిస్థితి గతం కంటే మెరుగయ్యిందని.

వైసీపీ భావిస్తోంది.గత ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో టీడీపీ గాలి బలంగా వీచింది.

ఒకరకంగా టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటే .ఈ జిల్లాలే కారణం.

కానీ ఇప్పుడు టీడీపీ గాలి తగ్గిందని.జనసేన ఓట్లు చీల్చినా.

తమకు ఏ ఢోకా లేదని వైసీపీ బలంగా నమ్ముతోంది.