అఖిల్ తొలి సినిమా అందుకే ఫ్లాపైంది.. ప్రముఖ రచయిత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ గా, డైరెక్టర్ గా వెలిగొండ శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

అఖిల్ హీరోగా తెరకెక్కిన "అఖిల్" సినిమాకు కథ అందించిన రచయిత వెలిగొండ శ్రీనివాస్ కావడం గమనార్హం.

వి.వి.

వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన "అఖిల్" బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందని ప్రేక్షకులు భావించగా అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను మెప్పించలేక ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

వెలిగొండ శ్రీనివాస్ తన సినీ కెరీర్ లో 30కు పైగా 35 సినిమాలకు పని చేశానని ఆయన తెలిపారు.

రైటర్లకు మార్క్ ఉండటం చాలా తక్కువ సమయాలలో జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.నేను శ్రీహరి సినిమాలు రాస్తానని ఒక ముద్ర పడిందని ఆయన తెలిపారు.

"""/"/ సీమశాస్త్రి సినిమాకు, కితకితలు, అత్తిలి సత్తిబాబు, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమాలకు తాను పని చేశానని అయితే తాను కామెడీ సినిమాలు రాస్తానని మళ్లీ ముద్ర పడిందని ఆయన చెప్పుకొచ్చారు.

గోపీచంద్ మలినేని దగ్గర కొన్ని సినిమాలకు తాను పని చేశానని ఆయన తెలిపారు.

ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ సినిమాలకు మాత్రమే తాను పని చేస్తానని మళ్లీ కామెంట్లు వినిపించాయని ఆయన తెలిపారు.

"""/"/ అఖిల్ సినిమా కొత్తదనంతో ఉంటుందని సూర్యుడు, జువా లాంటి కాన్సెప్ట్ లను టచ్ చేశామని ఏదో కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేశానని కానీ సినిమా ఫ్లాపైందని ఆయన తెలిపారు.

అఖిల్ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్లే ఫ్లాపైందని వెలిగొండ శ్రీనివాస్ పరోక్షంగా వెల్లడించారు.

రామ్ చరణ్ ను దృష్టిలో ఉంచుకుని తాను అఖిల్ సినిమా కథను రాశానని అందువల్ల ఆ సినిమా ఫ్లాపైందని ఆయన తెలిపారు.

వెలిగొండ శ్రీనివాస్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వైరల్ వీడియో: దేవుడా.. గేదె మేడలో 10 కేజీల గోల్డ్ చైన్..