జూనియర్ ఎన్టీఆర్ ను అర కిలోమీటర్ ఎత్తుకొని వెళ్లారట.. అసలేం జరిగిందంటే?

ఎన్టీఆర్ కేరీర్ లోని ఫ్లాప్ సినిమాలలో ఆంధ్రావాలా సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలలో ఆవుల గిరి ఒకరు.

తాజాగా ఆవుల గిరి ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆంధ్రావాలా సినిమా వల్ల ప్రెస్ వాళ్లతో గొడవ అయిందని అన్నారు.

తాను ప్రెస్ ను ఎప్పుడూ గౌరవిస్తానని ఆవుల గిరి వెల్లడించారు.ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ కు రావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన అన్నారు.

ఆంధ్రావాలా సినిమా హీరోయిన్లు ఆడియో ఫంక్షన్ కు రావడానికి నడవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆడియో ఫంక్షన్ కు 15 లక్షల మంది ఫ్యాన్స్ వస్తే ప్రెస్ వాళ్ల బస్సు వచ్చే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు.

ఈవెంట్ కు ఎన్టీఆర్ ను అర కిలోమీటర్ ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వచ్చిందని ఆవుల గిరి పేర్కొన్నారు.

అక్కడి పరిస్థితుల వల్ల తారక్ ను ఎత్తుకొని వెళ్లారని ఆయన అన్నారు. """/" / కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందని ఎవరినీ ఎవరూ పాడు చేయలేరని ఆయన తెలిపారు.

సింహాద్రి సినిమా తర్వాత ఆ సినిమా రావడం, ఆడియో ఫంక్షన్ కు లక్షల్లో ఆడియన్స్ రావడం వల్ల ఆంధ్రావాలా సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయని ఆయన వెల్లడించారు.

ఆంధ్రావాలా సినిమా వల్ల తనకు చివరకు లాభాలే మిగిలాయని ఆవుల గిరి కామెంట్లు చేశారు.

"""/" / ఆంధ్రావాలా సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇచ్చానని ఆవుల గిరి పేర్కొన్నారు.

నా అల్లుడు సినిమాకు కొంత మొత్తం నష్టం వచ్చిందని అయితే ఎన్టీఆర్ స్థాయికి ఆ నష్టాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆవుల గిరి అభిప్రాయపడ్డారు.

వైరల్ వీడియో: ఆడుతూ పాడుతూనే 184 మంది మృత్యువాత.. వైరల్ వీడియో