పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి.. తండ్రి అయిన స్టార్ డైరెక్టర్?

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి మనందరికీ తెలిసిందే.తమిళ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో అట్లీ కూడా ఒకరు.

కాగా అట్లీ నటి ప్రియా మోహన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

2014లో ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

గత ఏడాది ప్రియా మోహన్ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అట్లీ సోషల్ మీడియా వేదికగా తెలిపిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా అట్లీ భార్య నటి ప్రియా మోహన్ మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అట్లీ.

"""/" / ఇందుకు సంబంధించిన విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో అభిమానాలతో షేర్ చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.

అవును వారు చెప్పింది నిజమే.ప్రపంచంలో దీన్ని మించిన ఆనందం మరెక్కడా లేదు.

మాకు మగబిడ్డ జన్మించారు.ఈ విషయాన్ని చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

మా బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు అట్లీ.

ఈ పోస్ట్ ని చూసి అభిమానులు అలాగే నెటిజన్స్ సినీ సెలబ్రిటీలు అట్లీకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

"""/" / ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇకపోతే అట్లీ, ప్రియా మోహన్ ల విషయానికొస్తే.పెళ్లికి ముందే కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఆ తర్వాత 2014లో వైవాహిక బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.

అయితే పెళ్లయిన తర్వాత దాదాపుగా 8 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో అట్లీ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అంతేకాకుండా అట్లీ, భార్య ప్రియా మోహన్ ఇంట్లో ప్రస్తుతం వేడుకలు మొదలయ్యాయి.

మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన పుష్ప 2.. మౌనం వహిస్తున్న మెగా ఫ్యామిలీ?