కమెడియన్ అలీ ఫస్ట్ లవ్ స్టోరీ తెలుసా.. ఎందుకు బ్రేకప్ అయ్యిందంటే?
TeluguStop.com
వెండితెర, బుల్లితెర ప్రేక్షకులను తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో నవ్వించి ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు ఎన్నో సక్సెస్ లను కమెడియన్ అలీ సొంతం చేసుకున్నారు.
అలీతో సరదాగా షోలో అలీ మాట్లాడుతూ ఎన్నో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎక్కడికి వెళ్లినా అలీ మనోడు అనిపించుకున్నానని చనిపోయే వరకు ఇలానే ఉంటానని అలీ పేర్కొన్నారు.
నేను మంచి చేస్తే అది నా పిల్లలకు వస్తుందని అలీ చెప్పుకొచ్చారు.సీతాకోకచిలుక సినిమాను మొదటి అవార్డ్ ను అందుకున్నానని అలీ తెలిపారు.
నేను నటించిన యమలీల మూవీ ఏడాది పాటు ఆడిందని అలీ కామెంట్లు చేశారు.
150కు పైగా సినిమాలలో తాగుబోతు పాత్రల్లో కనిపించానని సౌత్ భాషలను మాట్లాడగలనని ఇతరులు మాట్లాడినా అర్థం చేసుకోగలనని అలీ తెలిపారు.
షోలే సినిమా వల్ల తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని నా కామెడీ అంటే పూరీ జగన్నాథ్ కు చాలా ఇష్టమని అలీ కామెంట్లు చేశారు.
కమెడియన్ కావాలని సినిమాల్లోకి వచ్చానని అలీ చెప్పుకొచ్చారు.మా ఇంటికి దగ్గర్లో ఒక అమ్మాయి ఉండేదని ఒకరోజు ఆమె వర్షంలో తడుచుకుంటూ వెళ్లడం చూసి గొడుగు కొనిచ్చానని అలీ తెలిపారు.
ఆ అమ్మాయి అమ్మకు నచ్చలేదని అందువల్లే పెళ్లి వద్దని అనుకున్నామని అలీ కామెంట్లు చేశారు.
"""/"/
ఆ తర్వాత మరో అమ్మాయితో పెళ్లి జరగాల్సి ఉన్నా ఆగిపోయిందని అలీ పేర్కొన్నారు.
ఆ తర్వాత జుబేదాను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.నాకు పవన్ కళ్యాణ్ కు గ్యాప్ రాలేదని కొన్ని వెబ్ సైట్లు గ్యాప్ క్రియేట్ చేశాయని అలీ తెలిపారు.
అలీ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్18, సోమవారం 2024