విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో ఫ్యామిలీ స్టార్.. భారీ నష్టాలు రావడమే కారణమా?

ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు విడుదలైన చాలా రోజులకు కానీ ఓటీటీలో విడుదల కావడం లేదు.

అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో( OTT ) రిలీజ్ అవుతూ మంచి లాభాలను అందుకుంటున్నాయి.

తక్కువ సమయంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం వల్ల నిర్మాతలకు నష్టాలు తగ్గుతున్నాయి.అయితే ఫ్యామిలీస్టార్ మూవీ( Family Star Movie ) ఈ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.

ఉగాది పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా 21 రోజులకే ఓటీటీలో అందుబాటులోకి రావడం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ( Amazon Prime OTT )ఈ సినిమా ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.

ఫ్యామిలీ స్టార్ సినిమాకు జరిగిన బిజినెస్ తో పోల్చి చూస్తే సగం కూడా కలెక్షన్లు రాలేదనే చెప్పాలి.

"""/" / విజయ్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ మరో భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

విజయ్ ఇకపై కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో మరింత జాగ్రత్త పడాల్సి ఉంది.

వరుస ఫ్లాపుల వల్ల కొన్నిసార్లు కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయి.

విజయ్ దేవరకొండ గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / మరోవైపు ప్రశాంత్ నీల్( Prashanth Neil ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్2 సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తారంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

తెలుగులో మృణాల్ ఠాకూర్ ఖాతాలో తొలి ఫ్లాప్ గా ఫ్యామిలీస్టార్ సినిమా నిలిచింది.

విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి14, మంగళవారం2025