బర్త్‌డే కేక్‌లో ఊహించని గిఫ్ట్ పెట్టిన ఫ్యామిలీ.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

బర్త్‌డే కేక్‌లో ఊహించని గిఫ్ట్ పెట్టిన ఫ్యామిలీ ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ఈ రోజుల్లో అన్ని శుభకార్యాలను చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు ప్రజలు.

బర్త్‌డే కేక్‌లో ఊహించని గిఫ్ట్ పెట్టిన ఫ్యామిలీ ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ముఖ్యంగా బర్త్‌డే పార్టీని సంవత్సరమంతా గుర్తుండేలా గ్రాండ్గా జరుపుతున్నారు.అలాగే కేక్‌ల్లో స్పెషల్ గిఫ్ట్ పెట్టి మరీ తమ ప్రియమైన వారిని ఆనందంలో ముంచెత్తుతున్నారు.

బర్త్‌డే కేక్‌లో ఊహించని గిఫ్ట్ పెట్టిన ఫ్యామిలీ ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

అయితే తాజాగా పేరెంట్స్ ఓ బర్త్‌డే కేక్‌లో ఊహించని గిఫ్ట్ ఉంచి తమ అమ్మాయిని సర్ ప్రైజ్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఫారెన్ యువతి తన 18వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం చూడొచ్చు.

పక్కనే ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు.ఈ యువతి తన ఫ్యామిలీ తన కోసం ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేయాలనుకుంది.

కానీ అందులో ఒక గిఫ్ట్ ఉండడంతో అదేంటో చూడాలని ఆమె దానిని బయటికి తీసింది.

అంతే ఒక్కసారిగా డాలర్ల నోట్లు బయటపడ్డాయి.అయితే వరుసగా ఒక తాడు లాగా కట్టిన ఈ నోట్లు ఎంత లాగినా వస్తూనే ఉన్నాయి.

దాంతో ఆ యువతి నవ్వుతూ చాలా సంతోషపడి పోయింది.దీనికి సంబంధించిన వీడియోని ఆ ఫ్యామిలీ వీడియో తీసి టిక్ టాక్ లో షేర్ చేసింది.

దీనితో ఇది కాస్తా వైరల్ గా మారింది.టిక్ టాక్ తో పాటు ఇతర సోషల్ మీడియా సైట్స్ లో కూడా ఈ వీడియో వైరల్ అవుతుంది.

దీనిని చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.సంవత్సరం అంతా షాపింగ్ చేసుకునేంత డబ్బులు ఇచ్చిన ఫ్యామిలీని పొగుడుతున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

గోపీచంద్ పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు…