సీరియల్ నటుడుతో ప్రియాంక చోప్రా పెళ్లి ఫిక్స్ చేసిన కుటుంబ సభ్యులు
TeluguStop.com
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ప్రస్తుతం హాలీవుడ్ లో జెండా పాతడానికి ప్రయత్నం చేస్తున్న విశ్వ సుందరి ప్రియాంక చోప్రా.
ఈ బ్యూటీ హాలీవుడ్ లో రీసెంట్ గా వైట్ టైగర్ అనే సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
అలాగే ఓ మూడు సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో కూడా నటించడానికి ప్రియాంక చోప్రాకి తీరిక లేదు.
ఇదిలా ఉంటే హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ నటుడు, సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
తనకంటే వయస్సులో చిన్నవాడైన నిక్ ప్రియాంకతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి ఆమె పేరెంట్స్ ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం వీరి ఫారిన్ లోనే సెటిల్ అయిపోయారు.అప్పుడప్పుడు ప్రియాంక ఇండియా వస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని పంచుకుంది.
నిక్ కంటే ముందుగా వేరొక నటుడుతో తన పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఫిక్స్ చేశారని తెలిపింది.
దేవొంకే దేవ్ మహాదేవ్ సీరియల్ లో శివుడు పాత్రలో కనిపించిన మొహిత్ రైనాతో పెళ్లి చేయాలని భావించారు.
అతనితో పెళ్లి అయితే బాగుంటుందని భావించింది.నేను కూడా ఆ సమయంలో పెద్దగా అడ్డు చెప్పలేదు.
అయితే ఆ నిర్ణయం పెళ్లి పీటల వరకు వెళ్ళలేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే ప్రియాంక నిక్ జోనస్ కి ముందు బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో డేట్ లో ఉండేది అనే టాక్ నడిచింది.
అలాగే మరికొంత మంది పేర్లు కూడా ఆమెతో రిలేషన్ షిప్ విషయంలో వినిపించాయి.