ప్రజలను తప్పుదోవ పట్టించడానికే అసత్య ప్రచారాలు..: మంత్రి ధర్మాన
TeluguStop.com
టీడీపీ నేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్న చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.
తాము భూములు దోచుకుంటున్నామని అంటున్నారు.మీరు నిరూపించగలరా అని నిలదీశారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.ఇప్పటికైనా కుట్ర పూరిత చర్యలు చేయడం మానుకోవాలన్నారు.
ప్రజలకు నిజం తెలిపే విధంగా మాట్లాడాలని సూచించారు.టీడీపీ కి వైసీపీ సర్కార్ పై బురద జల్లడమే పనిగా ఉందని విమర్శించారు.
ఆ విషయంలో మహేష్ నమ్రతలతో పోల్చి చూస్తే సితార టాప్.. అసలేం జరిగిందంటే?