యూకేపై భారతీయ విద్యార్ధులకు తగ్గుతోన్న మోజు.. కారణాలేంటి..?

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది.

యూఎస్, యూకే, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలు మన యువత ఫేవరేట్ డెస్టినేషన్స్.

అలాంటిది యూకేకు( UK ) వెళ్లే భారతీయ విద్యార్ధుల సంఖ్య ఇటీవలి కాలంలో తగ్గుతోంది.

యూకేలో చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్ధుల్లో భారతీయులదే ఆధిపత్యం.కానీ గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు బ్రిటన్‌లో అడుగుపెట్టిన భారతీయ విద్యార్ధుల్లో( Indian Students ) 23 శాతం తగ్గుదల నమోదైందని ఆ దేశ హోంశాఖ సంచలన నివేదిక వెల్లడించింది.

"""/" / విదేశీ విద్యార్ధుల సంఖ్యలో భారతీయులు, నైజీరియన్లే టాప్‌లో ఉన్నారని.కానీ ఈసారి ఈ రెండు దేశాల నుంచి వరసగా 23 శాతం, 46 శాతం తగ్గుదల నమోదైంది వివరించింది.

వృత్తి నిపుణుల కోసం ఏటా 3 వేల వీసాలను మంజూరు చేస్తుండగా.వాటికి కూడా ఆదరణ తగ్గిందని యూకే హోంశాఖ పేర్కొంది.

ఏడాదిలో 1,10,006 స్టూడెంట్ వీసాలను( Student Visa ) జారీ చేయగా.గతేడాదితో పోలిస్తే 32,687 వీసాలు తగ్గాయని వెల్లడించింది.

3000 యంగ్ ప్రొఫెషనల్ వీసాలలో ఈసారి కేవలం 2,234 మందే ఈ వీసాలకు దరఖాస్తు చేసినట్లు హోంశాఖ వెల్లడించింది.

"""/" / ఇటీవల జరిగిన యూకే సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్( Rishi Sunak ) స్థానంలో అధికారంలోకి వచ్చిన కీర్ స్టార్మర్( Keir Starmer ) ప్రభుత్వం సైతం వలసల నియంత్రణపై దృష్టి సారించినట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి.

టెక్, ఇంజనీరింగ్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడంపై తన ఉద్దేశ్యాన్ని సూచించింది.స్కిల్డ్ వర్కర్ వీసాలపై ఈ రంగాలు ఆధారపడటాన్ని సమీక్షించాలని హోం సెక్రటరీ యివెట్ కూపర్ .

( Yvette Cooper ) మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎంఏసీ)ని కోరారు.ఈ మేరకు ఎంఏసీ ఛైర్‌కు రాసిన లేఖలో .

కొన్ని కీలక వృత్తులు అంతర్జాతీయ రిక్రూట్‌మెంట్‌పై ఎందుకు ఎక్కువగా ఆధారపడతాయో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

హోమ్ ఆఫీస్ గణాంకాలు కూడా విద్యార్దులు, నైపుణ్యం కలిగిన కార్మికుల నుంచి వీసా దరఖాస్తులలో గణనీయమైన తగ్గుదలను వెల్లడిస్తున్నాయి.

కొద్దిరోజుల క్రితం కుటుంబంపై ఆధారపడిన వారిపై కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చినందున దరఖాస్తులు బాగా తగ్గాయి.

రోడ్డుపై రచ్చ చేసిన యూట్యూబర్ హర్ష.. రంగంలోకి దిగిన పోలీసులు..?