ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి..: చంద్రబాబు

టీడీపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు.

అందుకే వైసీపీ( YCP ) ఫేక్ పరిశ్రమ తెరపైకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఫేక్ పరిశ్రమలో తప్పుడు వీడియోలు సృష్టిస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

అదేవిధంగా ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు.సూపర్ సిక్స్ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

వాలంటీర్లతో( Volunteers ) తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామంటే తట్టుకోలేకపోతున్నారని తెలిపారు.

ఈ క్రమంలోనే ఏ పార్టీ అభ్యర్థి అయినా ఓట్లు పడే విధంగా మూడు పార్టీల నేతలు కృషి చేయాలని వెల్లడించారు.

రజనీకాంత్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చేసిన చిలుక.. వీడియో వైరల్..