బంగార్రాజు సినిమాపై ఇంత పగా.. ఏపీలో లాక్ డౌన్ అంటూ ఫేక్ ప్రచారంతో?

నాగార్జున హీరోగా నటిస్తున్న బంగార్రాజు సినిమాపై కొంతమంది పగబట్టారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఏపీలో లాక్ డౌన్ ను అమలు చేయకపోయినా పాక్షిక లాక్ డౌన్ అంటూ కొంతమంది వైరల్ చేస్తున్న వార్తలు బంగార్రాజు సినిమాను టార్గెట్ చేసి చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

టికెట్ రేట్ల సమస్యపై స్పందించమని అడిగిన ప్రశ్నకు నాగ్ చెప్పిన సమాధానం కొంతమంది హీరోల ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన సంగతి తెలిసిందే.

ఆ కోపం వల్లే లాక్ డౌన్ అంటూ వార్తలను ప్రచారం చేసి అటు థియేటర్ల యజమానులను, ఇటు సినిమాలు చేసే ప్రేక్షకులను భయపెట్టే దిశగా అడుగులు అయితే పడుతున్నాయి.

అయితే ఏపీ ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ ను అమలు చేయడం లేదని ప్రకటన మాత్రం వెలువడింది.

స్టార్ హీరో నాగార్జునపై కోపంతో కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.

"""/" / సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారంలో ఆంక్షలకు సంబంధించిన పూర్తి నిబంధనలు ఉండటం వల్ల ఎక్కువమంది ఈ వార్తలు నిజమే అయ్యి ఉండవచ్చని అనుకున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లను మూసివేసినా ఆంక్షలు విధించినా నిర్మాతలకు మరింత భారం పెరగడంతో పాటు షేర్ కలెక్షన్లు తక్కువగా వస్తాయి.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా తెలుగు రాష్ట్రాల్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయి. """/" / అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజలు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

బంగార్రాజును టార్గెట్ చేసి కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నా ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందని నాగార్జున అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

సోగ్గాడే చిన్నినాయన సినిమాను మించి బంగార్రాజు విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామా ? తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ?