వామ్మో కిడ్నీకి ఏడు కోట్లు ఇస్తామన్నారట..? పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తున్నారా?
TeluguStop.com
ఇంటి బాగోగులు ఎంత ముఖ్యమో పిల్లలపై దృష్టి పెట్టడం అంతకంటే ముఖ్యం.పిల్లలు ఏం చేస్తున్నారు.
ఎలా ఉంటున్నారు.వారి ఆలోచనలు ఏంటి? తప్పు దారుల్లో నడుస్తున్నారా? తెలియకుండానే తప్పులు చేస్తున్నారా? వారి మానసిక పరిస్థితి ఏంటి అనేవి ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండాలి.
డబ్బులు దొంగతనాలు చేయడం, ఆన్ లైన్ బెట్టింగ్స్ లో డబ్బులు కోల్పోయి ఇంట్లో డబ్బులు తీయడం, వాటి గురించి మందలిస్తే ఆత్మహత్యలు చేసుకోవడం, చెడు సావాసాలు, డ్రగ్స్, మద్యం, అమ్మాయిలు ఇలా ఎన్నో ఎన్నో రకాలుగా ఈ కాలం యువత తప్పు దారిన పోతోంది.
పిల్లలు ఎలా ఉంటున్నారో అర్థం చేసుకోవడం కూడా కష్టంగా మారింది ఈ కాలం తల్లిదండ్రికి.
అందుకే వారిని ఎప్పుడు గమనిస్తూ ఉండడం చాలా మంచిది.ఇంట్లో డబ్బుంది.
నాన్నకు తెలియకుండా ఓ కూతురు రెండు లక్షలు ఖర్చు చేసింది.అది కూడా ఇంటర్ చదివే ఓ విద్యార్థిని.
నాన్నకు తెలియకూడదు అని ఆమె చేసిన తప్పు ఇంటినే ఇరకాటంలో పారేసింది.దాచి పెట్టిన డబ్బును ఇతరులు పాలు చేసింది.
ఒక్కసారి ఆ విద్యార్థిని చేసిన తప్పు ఏంటి అసలు ఏం జరిగింది మీకోసం.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలానికి చెందిన ఓ ఆసామి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అతని కుమార్తె హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుతోంది.సోమవారం తన తండ్రితో కలిసి గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ కె.
ఆరిఫ్ హఫీజ్‌ను కలిసింది.కిడ్నీ విక్రయిస్తే రూ.
7 కోట్లు ఇస్తామంటూ.తన నుంచి రూ.
16.40 లక్షల మేర వసూలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు తనను మోసగించారంటూ ఫిర్యాదు చేసింది.
తన తండ్రి ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో రూ.20 లక్షలు దాచాడట.
తండ్రికి తెలియకుండా ఆ ఖాతాలో ఉన్న సొమ్ములో రూ.2 లక్షలను ఫోన్‌పే ద్వారా సొంతానికి ఖర్చు చేసింది.
"""/"/
కాగా, రూ.2 లక్షలు ఖర్చు చేసిన విషయం తండ్రికి తెలిస్తే మందలిస్తాడన్న భయంతో ఆ డబ్బుల్ని తానే సంపాదించి తండ్రికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది.
డబ్బు సంపాదించే మార్గం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 26న యూట్యూబ్‌లో వెదికింది.
అందులో కిడ్నీ దానం చేస్తే రూ.7 కోట్లు చెల్లిస్తామనే ప్రకటన ఆమెను ఆకర్షించింది.
అందులో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి.ఆన్‌లైన్, వాట్సాప్ ద్వారా ఎదుటి వ్యక్తులతో మాట్లాడింది.
శస్త్రచికిత్సకు ముందు రూ.3.
50 కోట్లు, శస్త్రచికిత్స తరువాత రూ.3.
50 కోట్లు చెల్లిస్తామని మోసగాళ్లు ఆ యువతికి చెప్పారు.పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాలంటే పన్నుల రూపేణా ముందుగా నగదు చెల్లించాల్సి వస్తుందన్నారు.
తండ్రి పేరుతో చెన్నైలోని ఓ బ్యాంక్‌లో ఖాతా తెరిచి, రూ.3.
50 కోట్లు జమ చేసినట్టు ఆమెను నమ్మించారు.ఆ యువతి నుంచి విడతల వారీగా రూ.
16.40 లక్షలను ఆన్‌లైన్ ద్వారా పంపించింది.
ఎంతకీ డబ్బు రాకపోవడంతో తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని కోరింది.సదరు మోసగాళ్లు ఢిల్లీ రావాలని సూచించగా.
ఆ యువతి అక్టోబర్ 8న విమానంలో ఢిల్లీ వెళ్లింది.వారిచ్చిన చిరునామాలో సంబంధిత వ్యక్తులెవరూ లేకపోవడంతో వెనక్కి వచ్చేసింది.
"""/"/
ఈ విషయం తండ్రికి తెలిస్తే తిడతాడనే భయంతో సదరు యువతి ఎన్టీఆర్ జిల్లాలోని స్నేహితుల వద్దకు వెళ్లి తలదాచుకుంది.
కుమార్తె అదృశ్యంపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా.ఆమెను గుర్తించి తండ్రికి అప్పగించారు.
డబ్బులు విషయమై కుమార్తెను అడగ్గా జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది.దీనిపై ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విచారణ వేగవంతం చేయాలని కోరుతూ స్పందనలో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు వినతిపత్రం అందించారు.
చూసారు కదా ఇలాంటివి మనింట్లో జరగవు అనుకోకండి.కేవలం రెండు లక్షల కోసం కిడ్నీని అమ్మడానికి వెనుకాడలేదు.
దాని కోసం విమానంలో ఢిల్లీ కూడా వెళ్లింది.తెలిసితెలియక చేసిన తప్పు వల్ల అది ఎంతో దూరం వెళ్లింది.
స్నేహితులు ఇంట్లో తలదాచుకుంది.గుండె బరువెక్కి ఇంకేదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటే.
అందుకే అంత ఈజీగా నా పిల్లలు ఏం చేయరు అని నమ్మడం మానేసి కాస్త వారిపై దృష్టి పెడితే మన పిల్లలు సేఫ్.
అంధ గాయకుడిని ఉద్దేశించి థమన్ పోస్ట్ వైరల్.. అతడిలో గొప్ప టాలెంట్ ఉందంటూ?