వైరల్ వీడియో.. డబ్బు కోసం ఇంత డ్రామా అవసరమా?

సోషల్ మీడియాలో రోజూ చాలా వీడియోలు వైరల్( Viral Video ) అవుతుంటాయి.

అయితే వీటిలో కొన్నింటి వెనుక వాస్తవాలు, మరికొన్నింటి వెనుక అబద్ధాలు దాగి ఉంటాయి.

ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించే బిచ్చగాళ్ల( Beggars ) గురించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక వ్యక్తి తన తారస పడిన వికలాంగుడిలా( Disable ) నటించే బిచ్చగాడి నిజస్వరూపాన్ని బయటపెట్టిన తీరు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

"""/" / రోడ్డుపక్కన ఆగిన కారుకు ఒక యువకుడు వచ్చి డబ్బు అడిగాడు.

కారులో ఉన్న వ్యక్తి, "నువ్వు కొంచెం నడిచి చూపిస్తే, 500 రూపాయలు ఇస్తాను" అని చెప్పాడు.

అప్పటివరకు రెండు ఊతకర్రలుతో కుంటుకుంటూ వచ్చిన ఆ బిచ్చగాడు, ఆ వ్యక్తి సూచించినట్లు ఊతకర్రలు తీసి, సాదారణ మనిషిలా నడిచాడు.

వికలాంగుడిలా నటిస్తూ అడుక్కుంటున్న ఆ వ్యక్తి నిజానికి పూర్తిగా ఆరోగ్యవంతుడని ఆ వీడియోతో బయటపడింది.

"నిజంగా నీకు సహాయం అవసరమా? ఏ పని చేయడానికి నీకు ఏం కష్టమొచ్చింది?" అని ప్రశ్నించగా.

అతను తన పేరు బాదల్( Badal ) అని, తల్లితో కలిసి కాలిబాటపై నివసిస్తున్నానని చెప్పాడు.

కుంటివాడిలా నటిస్తేనే ప్రజలు డబ్బు ఇస్తారని, తన తల్లికి సహాయం చేసేందుకు ఇలా చేస్తున్నానని చెప్పాడు.

"""/" / అయితే, ఆ వ్యక్తి అతని మాటలను నమ్మలేదు."కుంభమేళాకు వెళ్లిన నాన్న గురించి అబద్ధాలు చెప్పకూడదు" అని క్లాస్ తీసుకున్నాడు.

నిజానికి, ఇటువంటి నటనతో రోజుకు 300 నుండి 400 రూపాయలు సంపాదిస్తున్నానని బాదల్ చెప్పాడు.

అంతకు ముందు 500 రూపాయలు ఇస్తానన్న ఆ వ్యక్తి, చివరికి 20 రూపాయలే ఇచ్చాడు.

నిజంగా ఆర్థిక సహాయం అవసరంలో ఉన్నవారికి మాత్రమే సహాయం చేయాలని పేర్కొన్నాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

కొందరు ఆ వ్యక్తిని నిజాయితీ కలిగినవాడిగా ప్రశంసిస్తుంటే, మరికొందరు "డబ్బు కోసం ఏమైనా చేస్తాడు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.