అదే నిజమైతే మోడీ.. పాలిటిక్స్ కు దూరమేనా ?

కేంద్రంలో గత తొమ్మిదేళ్లుగా బీజేపీ ( BJP ) అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ( Narendra Modi ) అని ప్రతిఒక్కరు ఒప్పుకోవాల్సిందే.

ఎందుకంటే 2014 నుంచి ఇప్పటివరకు కేవలం మోడి మేనియా తోనే బీజేపీ నెట్టుకొస్తోంది.

ఇక వచ్చే ఎన్నికల్లో కూడా మోడీ బొమ్మతోనే విజయం సాధించాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది.

అయితే ఈసారి ఎలాగైనా మోడీని గద్దె దించాలని విపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

మోడిని ఇరుకున పెట్టె ఏ చిన్న అవకాశాన్ని కూడా విపక్షాలు వదలడం లేదు.

తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ( AAP ) మోడి ఎడ్యుకేషన్ గురించి బయటపెడుతున్న విషయాలు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

నరేంద్ర మోడి ఫెక్ డిగ్రీతో ప్రధాని పదవి చేపట్టారని అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆప్ నేతలు చూపిస్తున్నారు.

దీంతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంటోంది.గుజరాత్ విశ్వ విద్యాలయం నుంచి " పోలిటికల్ సైన్స్ " పూర్తి చేసినట్లు మోడీ డిగ్రీ సర్టిఫికేట్ సృష్టించుకున్నారని, అది నకిలీ సర్టిఫికేట్ అని అప్ నేత సంజయ్ సింగ్ తో( Sanjay Singh ) పాటు పలు ఆప్ నేతలు చెబుతున్నారు.

ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని పేర్కొన్న ఫాంట్ 1992 లో ఉనికిలోకి వచ్చిందని కానీ ఆ ఫాంట్ తో 1983 లో సర్టిఫికేట్ ఎలా వచ్చిందని అప్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇంకా చాలా సందర్బల్లో స్వయంగా మోడిని తను పదవ తరగతి తరువాత చదువు మానేసినట్లు చేసిన ప్రసంగాలను బయటపెడుతున్నారు.

"""/" / ఒకవేళ ప్రధాని మోడి వద్ద ఉన్న డిగ్రీ సర్టిఫికేట్ నిజంగా నకిలీ అని నిరూపితం అయితే ఎన్నికల సంఘం నిబందనల ప్రకారం మోడీపై అనర్హత వేటు తప్పదని, అంతే కాకుండా ఎన్నికలకు కూడా మోడి దూరమవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు ఆప్ నేతలు.

అయితే ప్రజా ప్రతినిధుల చట్టం 1950 సెక్షన్ 8 లో నకిలీ అఫిడివేట్ ల గురించి ఎలాంటి సమాచారం లేదు.

అయితే ఇదే చట్టంలో సెక్షన్ 125 ( ఏ ) ప్రకారం అఫిడివేట్ లో తప్పుడు సమాచారం ఇస్తే ఆర్నెల్లు జైలు శిక్ష మరియు జరిమానా ఉంటుందని తెలుపుతోంది.

అయితే అనర్హత వేటుపై మాత్రం ఇందులో ప్రస్తావించలేదు. """/" / 2018 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మరియు, సుప్రీం కోర్టు వంటివి నకిలీ సమాచారం కూడా సంబంధించిన శిక్షలను నిబంధనలలో చేర్చాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.

కానీ అమల్లోకి రావడం లేదు.కాబట్టి మోడి వద్ద ఉన్న సర్టిఫికేట్ ఒకవేళ నకిలీ అని నిరూపితం అయిన.

ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.అయితే ఈ వివాదం మాత్రం మోడి ఇమేజ్ ను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.

దీనిని విపక్షాలు ప్రధాన విమర్శనాస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది.మరి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన మోడి డిగ్రీ సర్టిఫికేట్ గురించి.

కమలనాథులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

రాజకీయాల్లోకి రావాలని కోరిన అభిమానులు.. సూపర్ స్టార్ మహేష్ రియాక్షన్ ఇదే!