హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

హైదరాబాద్ నగరంలో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది.

ఈ కేసులో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ డిపార్ట్ మెంట్లకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంపులు, ఫేక్ సర్టిఫికెట్లను ముఠా తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రంగారావుగా పోలీసులు నిర్దారించారు.ఒక్కో డాక్యుమెంట్ తయారీకి రూ.

10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసుపై విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాస్ మహారాజ్ కూతురు.. సులువుగా క్లిక్ అవుతారా?