వరంగల్ లో నకిలీ ఏసీబీ అధికారి గుట్టురట్టు..పోలీసుల అదుపులో నిందితుడు..!
TeluguStop.com
జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి కష్టపడకుండా లక్షలు సంపాదించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు నకలీ ఏసీబీ అవతారం( Fake ACB Officer ) ఎత్తి, చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన వరంగల్ జిల్లాలో( Warangal ) చోటు చేసుకుంది.
అసలు వివరాలు ఏమిటో చూద్దాం.డీసీపీ పి.
రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాస్ రెడ్డి (35)( Patthi Srinivas Reddy ) పీజీ మధ్యలో ఆపేసి కష్టపడకుండా డబ్బులు సంపాదించేందుకు నకలీ ఏసీబీ అవతారం ఎత్తాడు.
భూమి కొలిచే సర్వేయర్ల మొబైల్ నెంబర్లు సేకరించి.వారికి ఫోన్ చేసి తాను ఏసీబీ అధికారినని, మీరు భూముల సర్వే కోసం రైతుల నుంచి పెద్ద ఎత్తున నగదు తీసుకుంటున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని ఆ సర్వేయర్లను భయపెట్టేవాడు.
"""/" /
మా శాఖ రైట్స్ జాబితా నుంచి మీ పేరును తొలగించాలంటే మా శాఖ ఉన్నత అధికారులు అడిగిన మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు.
ఈ క్రమంలోనే ఆగస్టు 16న నల్లబెల్లి మండల సర్వేయర్ మీరాల మల్లయ్యకు ఫోన్ చేసి బెదిరించి, రూ.
లక్ష డిమాండ్ చేశాడు.అయితే మల్లయ్య ప్రస్తుతం తన దగ్గర రూ.
2000 మాత్రమే ఉన్నాయని చెప్పి ఆ రూ.2 వేల ను ఫోన్ పే చేశాడు.
మిగిలిన డబ్బులు ఇవ్వడానికి కొంత సమయం కావాలని మల్లయ్య( Mallaiah ) కోరాడు.
తాజాగా సోమవారం శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడుగగా.
మల్లయ్య తన దగ్గర నగదు ఉందని, """/" /
వస్తే ఇస్తానని చెప్పడంతో హనుమకొండ నుంచి బస్సులో బయలుదేరి శనిగరం క్రాస్ రోడ్ వద్ద శ్రీనివాస్ రెడ్డి( Srinivas Reddy ) వేచి చూస్తున్నాడు.
అయితే అదే సమయంలో అటువైపు పోలీస్ వాహనం రావడం చూసిన శ్రీనివాస్ రెడ్డి పారిపోయే ప్రయత్నం చేశాడు.
శ్రీనివాస్ రెడ్డిని గమనించిన పోలీసులు తమను చూసి ఎందుకు పారిపోతున్నాడు అనే అనుమానంతో వెంటనే నల్లబెల్లి ఎస్ఐ నైనాల నాగేష్ అతనిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
అంతే కాదు శ్రీనివాస్ రెడ్డి పై 2011 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదైనట్లు తేలిందని డీసీపీ పి.
ఈ సింపుల్ చిట్కాతో చెప్పండి మొండి మచ్చలకు బై బై!