పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప.
( Pushpa ) 2021 లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామిని సృష్టించడంతో పాటు సరికొత్త రికార్డులను సృష్టించింది.పార్ట్ 1 పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి హిట్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో చివరి పావుగంట మరో లెవెల్ విలనిజాన్ని చూపించిన టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కి( Fahadh Faasil ) కూడా మంచి మార్కులు పడ్డాయి.
"""/" /
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు దక్కింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కానీ పుష్ప సినిమా వల్ల తనకేమీ ఒరిగింది లేదు అంటున్నాడు నటుడు ఫహద్ ఫాజిల్.
తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహద్ మాట్లాడుతూ.నాకు కేరళ దాటి పుష్ప మూలాన ఎక్కువ క్రేజ్ వచ్చిందా అంటే లేదు అనే చెప్తాను, అలా అని నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు.
ఆ విషయం నేను సుకుమార్( Sukumar ) గారికి కూడా చెప్పాను.పుష్ప అనే సినిమా కేవలం సుకుమార్ గారి మీద ఉన్న ప్రేమ, గౌరవం తోనే చేశాను.
"""/" /
అలాగే నా మొదటి ప్రియారిటీ ఎప్పటికీ మళయాళ సినిమానే ఉంటుంది అని తెలిపారు.
ఫహద్ పుష్ప సినిమా తరువాత కేరళ దాటి ఫహద్ మన తెలుగు స్టేట్స్ లో బాగా వినిపించాడు.
తన స్టేట్మెంట్ కొంతమందికి నొప్పించి ఉండొచ్చు కానీ తనకి అనిపించింది తాను చెప్పాడు పైగా సుకుమార్ తో కూడా అన్నానని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అదిరిపోయే స్పీచ్ ఇచ్చి అందరినీ నవ్వించిన చిన్నారి.. వీడియో వైరల్..