"జయం" సినిమా బన్నీ చేయకపోవడం వెనుక జరిగిన తంతు ఇదా?

అల్లు వారి ఇంటి అబ్బాయిగా మెగా ఫ్యామిలీ మేనల్లుడుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన హీరో అల్లు అర్జున్ తన సొంత టాలెంట్ తో నేడు సినీ పరిశ్రమలో గొప్ప స్థాయికి చేరుకున్నారు.

తాజాగా పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారి ప్రభజనం సృష్టించారు.ముఖ్యంగా బాలీవుడ్ లో తనదైన స్టైల్ తో అభిమానులను తనవైపు తిప్పుకుని అక్కడ కూడా స్టార్ డం ఖాతాను ఓపెన్ చేసేసారు ఈ హీరో.

పుష్ప మూవీ రికార్డులకు కేరాఫ్‌గా నిలిచి బన్నీ ఇమేజ్ ను దేశ నలుమూలలకు విస్తరింప చేసింది.

ఈ విషయం పక్కన పెడితే స్టార్ కిడ్ గా బన్నీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన స్వయం కృషితోనే ఇంత ఆదరణ అందుకొని ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో ఉన్నారన్నది వాస్తవం.

కాగా ఈ స్టార్ హీరో మొదట "గంగోత్రి" చిత్రంతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అయితే నిజానికి బన్నీ వేరే బ్లాక్ బస్టర్ మూవీతో తెరకు పరిచయం కావాల్సింది.

కానీ మిస్స్ అయిపోయిందని అంటున్నారు.వివరాల్లోకి వెళితే నితిన్, సదా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ ఘన విజయాన్ని సాధించి ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్ ను అందించింది.

అప్పట్లో యువత జయం చిత్రం కి ఫిదా అయిపోయారు.ఈ సినిమాతో నితిన్ కెరియర్ పట్టాలెక్కిందనే చెప్పాలి.

అయితే ఈ సినిమాకి హీరోగా ముందుగా అల్లు అర్జున్ ని అనుకున్నారట జయం మూవీ డైరెక్టర్ తేజ.

అయితే అప్పటికే బన్నీ ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇండస్ట్రీకి తానే పరిచయం చేస్తాను అని చెప్పడం.

గంగోత్రి కథ మెగా ఫ్యామిలీకి బాగా నచ్చడం తో జయం సినిమా కాకుండా గంగోత్రి సినిమాను ఫైనల్ చేశారట.

అలా జయం సినిమా కోసం బన్నీ మిస్స్ అవడంతో కొత్త హీరో కోసం వెతుకుతున్న దర్శకుడు తేజకి అప్పట్లో నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న‌ సుధాకర్ రెడ్డి తనయుడు నితిన్‌ బాగా నచ్చడంతో అతని తోనే జయం సినిమాను తీశారు.

చివరకు చూస్తే అంచనాలకు మించిన విజయాన్ని అందుకుని బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ.

"""/" / అలా జయం సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సినిమాతో పరిచయం అవ్వాల్సిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారని సమాచారం.

అంతే కాకుండా బన్నీ అందుకోవాల్సిన బిగ్గెస్ట్ హిట్ నితిన్ అకౌంట్ లోకి వెళ్ళిపోయింది అన్న మాట.

ఇలా ఒక హీరో చేయాల్సిన సినిమా అవకాశాలు మరో హీరో అందుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ లు అందుకున్న దాఖలాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.

ఊడిన జుట్టును కూడా మళ్లీ మొలిపించే అల్లం.. ఎలా వాడాలో తెలుసా?