ప్రభాస్ పై బాలీవుడ్ దండయాత్ర లో నిజం ఎంత ?

ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కానీ, ట్రైలర్, టీజర్స్ కానీ జనాలను ఆకట్టుకోలేకపోయాయి.

పాన్ వరల్డ్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ఇలాంటి ఒక చవక భారు కార్టూన్ సినిమా ఎందుకు చేస్తున్నాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మొదలైంది.

500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా నాసిరకమైన గ్రాఫిక్స్ వాడి ఒక కార్టూన్ షో చూపించేస్తున్నాడు ఓమ్ రౌత్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ప్రభాస్ కి ఇప్పటికే బాహుబలి సినిమా తర్వాత విజయాలు దక్కలేదు సాహో సినిమా తో చాటు రాధే శ్యామ్ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ ఆయన సంగతి మనకు తెలిసింది.

అలాంటి సమయంలో ఆది పురుష్ అనేది ఒక ప్రయత్నం ఎంత వరకు సబబు అని అనిపిస్తున్నప్పటికీ కొన్ని ప్రశ్నలు సాధారణ ప్రేక్షకులను వెంటాడుతున్నాయి.

ప్రభాస్ తన కెరీర్ ని ఆది పురుష్ సినిమా కోసం బలి చేసుకుంటాడా అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పాలి.

ఎంతో కొంత లోతైన విశ్లేషణ లేకుండా ఏది పడితే అది చేస్తా అంటే జనాలు చూస్తారు అని అనుకోడు కదా.

అందుకే అన్ని వందల కోట్ల బడ్జెట్ తన పైన పెడుతుంటే ఎంత క్వాలిటీ అవుట్ రావాలి అన్నది ప్రభాస్ కి ఒక క్లారిటీ ఉంటుంది.

అంత ఈజీగా బొక్క బోర్లా పడే టైప్ అయితే కాదు. """/"/ ఇక దర్శకుడు ఓం రౌత్ విషయానికొస్తే ఇప్పటికి కెరియర్ లో కేవలం మూడు సినిమాలు మాత్రమే తీశాడు.

2011లో హాంటెడ్ 3డి, 2017లో లోకమాన్య ఏక్ యుగ పురుష్.2020లో తానాజీ.

ఈ మూడు సినిమాలు దేనికదే ప్రత్యేకమైన జోనర్.ఇక ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరోతో సినిమా తీస్తున్నాడు అంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా తీసుకునే ఉంటాడు.

మనం టీజర్స్ లో చూసే విషయంతో సినిమాని అంచనా వేయడం కరెక్ట్ కాదు అనేది సినిమా ప్రేమికుల ఆవేదన.

అందుకే ప్రభాస్ ని బాలీవుడ్ తొక్కేయాలనుకుంటున్నారు అని కొంతమంది అంటున్నప్పటికీ ఎవరి కి వారు తన కెరీర్ ని తుంగలో తొక్కుకుంటారు చెప్పండి.

ఓం రౌత్ ప్రభాస్ కి ఫ్లాప్ ఇచ్చి తన కెరీర్ ని క్లోజ్ చేసుకోవడానికి అతడు ఏమైనా పిచ్చివాడా ? కాదు కదా ! అందుకే తొందరగా ఒక అంచనాకు రావడం మంచిది కాదు.

స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో న్యాచురల్ స్టార్.. అలాంటి మూవీ ప్లాన్ చేశారా?