మీ ఇంటి తులసి మొక్కలో ఈ మార్పులు గమనించారా.. అవి వేటికి సంకేతాలో తెలుసుకోండి

హిందువులు పవిత్రంగా పూజించే వాటిల్లో తులసి మొక్క ఒకటి.తులసి మొక్క లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు.

నిత్యం దేవుడికి పూజలు చేయని ఇంట్లో అయినా స్నానం చేయగానే తులసికి చెంబుడు నీళ్లు పోసి మొక్కుకోవడం ఆనవాయితి.

అంతటి ఖ్యాతి పొందిన తులసి వల్ల ఆథ్యాత్మిక ప్రయోజనాలే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మనకి తెలుసు.

రోజుకొక తులసి ఆకుని తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే.అటువంటి తులసి మొక్కలో కలిగే కొన్ని మార్పులు మన భవిష్యత్ కి సంకేతాలని పండితులు చెప్తున్నారు.

అప్పుడప్పుడు తులసి మొక్క తన సహజ రంగును కోల్పోతుంటుంది.లేదంటే ఆకులు సడన్‌గా ఎండి పోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది.

ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చట.ఏఏ మార్పులకు ఏ ఫలితాలు కనపడతాయో తెలుసుకోండి.

తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే.ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయట.

ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థమట.· ఒకవేళ నీళ్ళు పోయ కున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే.

ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థమట.భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుందట.

"""/" / పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే.ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరుగబోతుందని అర్థం.

ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం.చెట్టు ఆకులు సడన్‌గా వేరే రంగుకు మారితే.

ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థమట.ఎవరైనా గిట్టనివారు క్షుద్ర శక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయట.

దీనిని బట్టి తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు.తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.

మొక్కలో మార్పులు గమనిస్తూ ఉండాలి.వీటిని కొందరు మూఢ నమ్మకాలు అని కొట్టి పారేస్తుంటారు.

కొందరు నమ్ముతుంటారు.నమ్మకం అనేది మనపై ఆధారపడి ఉంటుంది.

ఏంటి భయ్యా.. యమలోకానికి పిలుపు వచ్చిందా? బండి అలా తోలుతున్నావ్(వీడియో)