ఈ దర్శకులు నిజంగా ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది !

సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఒకటి అదృష్టం ఉండాలి లేదంటే సక్సెస్ ఉండాలి.

ఈ రెండింటిలో ఏదో ఒకటి లేకుండా కెరీర్ కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం.

అయినా కూడా కొంతమంది బండిని ఎలా లాక్కొస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే భయంకరమైన ఫ్లాప్ చిత్రాలతో కూడా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ట్ గా మారిపోతూ ఉంటారు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొంతమంది దర్శకులు అయితే నిజంగా ఇండస్ట్రీలో ఉంటారు అని అనుకోలేదు.

అయినా కూడా వారు బాగానే సెటిల్ అవుతున్నారు.పైగా స్టార్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్నారు.

ఆ డైరెక్టర్స్ ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleమెహర్ రమేష్/h3p """/" / ఫ్లాప్ చిత్రం తోనే కెరియర్ మొదలుపెట్టాడు మెహర్ రమేష్( Meher Ramesh ) ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ శక్తి ఇచ్చి కోలుకోకుండా చేశాడు అయినా కూడా మెహర్ రమేష్ చిరంజీవితో సినిమా తీసి అక్కడ కూడా పరాజయం మూటగట్టుకున్నాడు కెరియర్లో ఆయన చేసిన ఏదైనా మంచి సినిమా ఉంది అంటే అది ప్రభాస్ తో చేసిన బిల్లా చిత్రం మాత్రమే.

అయినా కూడా ఎక్కడ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు మెహర్ రమేష్.h3 Class=subheader-styleహను రాఘవపూడి/h3p """/" / హను రాఘవపూడి( Hanu Raghavapudi ) సీతారామన్ సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.

అయితే ఇతడు అందాల రాక్షసి అనే సినిమాతో లావణ్య త్రిపాఠిని ఇండస్ట్రీకి పరిచయం చేసినా కూడా అది ఒక ఫ్లాప్ సినిమానే.

ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి కోలుకుంటాడు అని ఎవరు అనుకోలేదు.కానీ ఇప్పుడు ప్రభాస్( Prabhas ) తో సినిమా తీసే రేంజ్ కి వెళ్ళిపోయాడు.

H3 Class=subheader-styleవంశీ పైడిపల్లి/h3p దిల్ రాజు దగ్గర చాలా రోజుల పాటు పనిచేసిన వంశీ పైడిపల్లి ని మున్నా సినిమాతో డైరెక్టర్ గా మార్చేశాడు.

అయితే ఈ చిత్రం అటు ప్రభాస్ కి ఇటు వంశీకి పరాజయాన్ని మిగిల్చింది.

మళ్లీ మూడు సంవత్సరాల కోలుకొని బృందావనం సినిమాతో కం బ్యాక్ ఇచ్చాడు వంశీ.

H3 Class=subheader-styleహరీష్ శంకర్/h3p """/" / షాక్ అనే సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్.

ఈ సినిమా అతడికి మాత్రమే కాదు ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చినంత పని చేసింది.

అయినా కూడా ఇప్పుడు స్టార్ హీరోస్ ని డైరెక్ట్ చేస్తూ బాగానే స్టార్ డం కొనసాగిస్తున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 30, ఆదివారం 2024