కోలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్..శబాష్ ..మీరు దమ్మున్న వారు

సినిమా ఇండస్ట్రీలో అనేక రకాల వివాదాలు నడుస్తూనే ఉంటాయి.పరిశ్రమలోని పెద్దలు వాటిని తీరుస్తూ కూడా ఉంటారు.

ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ అని డైరెక్టర్స్ అసోసియేషన్ అని ప్రొడ్యూసర్ అసోసియేషన్ అంటూ రకరకాల సంస్థలు ఉన్నాయి.

అలా ప్రతి క్రాఫ్ట్ కి అంటే సినిమా ఇండస్ట్రీ అంటే 24 విభాగాలు అలా ప్రతి విభాగానికి కూడా ఒక సంస్థ ఉంది అన్నీ కలిపి కోలీవుడ్లో చాలా బాగా మేనేజ్ అవ్వబడుతున్నాయి.

కానీ ఇప్పుడు ఈ ఆర్టికల్ రాయడానికి గల ముఖ్య కారణం నటీనటుల సంఘం గురించి.

తెలుగు కన్నా కూడా తమిళనాడు నటీనటుల సంఘానికి ప్రత్యేకమైన వివాదాలు ఉంటాయి.వారు ఎవరి మాట వినరు అని ఒక వార్త కూడా ఉంది.

"""/" / అందులో నిజం లేకపోలేదు ఎందుకంటే ఏ వ్యక్తికి లేదా ఒక వ్యవస్థకి తలవంచేది కాదు నటీనటుల సంఘం అని తమిళనాడు పరిశ్రమ నిరూపిస్తుంది.

అవతల వ్యక్తి ఎంత పెద్ద హీరో అయినా తప్పు చేస్తే తల వంచాల్సిందే అనే సూక్తితోనే వారు పని చేస్తున్నారు ఈ విషయంలో వారిని మెచ్చుకోకుండా ఉండలేం.

ఇటీవల పెద్ద స్టార్ హీరోలపై కూడా వారు డెడ్లైన్ పెట్టి సమస్యలను సాల్వ్ చేసిన విధానం ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.

తాజాగా హీరో ధనుష్ పై కోలీవుడ్ చిత్ర పరిశ్రమ భగ్గుమంటుంది.ఎందుకంటే డబ్బులు తీసుకొని సినిమా చేయలేదు అంటూ ఆయన పై వచ్చిన కంప్లైంట్ తో అసోసియేషన్ పూర్తిస్థాయిలో ఏకీభవించి ధనుష్ మెడలు వంచే పని కూడా చేస్తుంది.

"""/" / ధనుష్ ( Dhanush )నెక్స్ట్ సినిమా డేట్స్ పూర్తిగా ఎవరినైతే మోసపూరితంగా పక్కకు పెట్టారు వారికి ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది అలాగే గతంలో విశాల్( Vishal ) విషయంలో కూడా కోలీవుడ్ నడిగర్ సంగం చాలా గట్టిగా రియాక్ట్ అయింది ఇలా ఏ ఒక్కరి కోసం కూడా తగ్గేదే అన్నట్టుగా వారి వ్యవహరిస్తున్న విధానానికి అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు.

నడిగర్ సంఘం ప్రస్తుతం ఇండియాలోనే స్ట్రాంగెస్ట్ ఒక సంస్థగా చెప్పుకోవచ్చు.

గాయం బాధ పెడుతున్న డాన్స్ కుమ్మేసావు.. ఎన్టీఆర్ డాన్స్ పై సినిమాటోగ్రాఫర్ కామెంట్స్!