సుజాత వర్సెస్ బాలచందర్.. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి?

సుజాత( Sujata ).ఈ తరం ప్రేక్షకులకు బాగా పరిచయం లేకపోవచ్చు కానీ వెంకటేష్ చంటి సినిమాలో అతనికి తల్లి పాత్రలో నటించిన నటిగా కొంతమేర గుర్తింపు ఉంది.

అయితే ఆమె టాలీవుడ్ లోనే సీనియర్ మోస్ట్ హీరోయిన్.అక్కినేని నుంచి శోభన్ బాబు( Shobhan Babu ) వరకు ప్రతి ఒక్కరితో ఆమె నటించింది.

ఆమె స్వతహాగా మలయాళీ అయినా పుట్టింది మాత్రం శ్రీలంకలో.ఆమె అక్కడే పెరిగి పెద్దయింది.

ఆ తర్వాత అనుకోకుండా తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తగులంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో ఆమె తిరుగులేని నటిగా దాదాపు రెండు దశాబ్దాలు కాలం పాటు ఏక ఛత్రాధిపత్యం చేసింది.

ఇక వయసు పెరిగిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ఆ తర్వాత తల్లి పాత్రలకు పరిమితం అయింది సుజాత.

ఆమెను తెలుగులో చివరగా శ్రీరామదాసు సినిమాలో కనిపించింది. """/" / ఇక తమిళంలో మాత్రం ఆమె ఎక్కువగా నటించడానికి కారణం అగ్రశ్రేణి దర్శకుడైన బాలచందర్( Balachander ) అని చెప్పాల్సిందే.

బాలచందర్ ఆమెని ఎక్కువగా సినిమాల్లో హీరోయిన్ గా తీసుకొని ప్రోత్సహించేవారు.బాలచందర్ దగ్గర ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసిన విషయం చాలామందికి తెలియదు.

ఒకానొక దశలో వీరిద్దరూ ప్రేమ ఆయనం కొనసాగిస్తున్నారని ఇండస్ట్రీ మొత్తం కోడై కోసింది.

వాస్తవం ఏంటో తెలియదు కానీ బాలచందర్ హీరోయిన్ గా మాత్రం ఆమెకు గుర్తింపు ఉంది.

బాలచందర్ పై ఉన్న అభిమానంతోనే ఆమె చాలా కాలం పాటు పెళ్లి చేసుకోకుండా ఉన్నారట.

కానీ లేటు వయసులో పెళ్లి చేసుకుని ఈ సినిమా ఇండస్ట్రీకి కొంతకాలం పాటు దూరంగా ఉన్నప్పటికీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొండడంతో మళ్లీ ఆమె సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నించింది.

"""/" / అయితే బాలచందర్ తో ఆమె దూరం కొనసాగించడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు రాలేదంటారు కొంతమంది.

ఏది ఏమైనా ఆ సుజాత చివరి దశలో ఎన్నో ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు అని సీనియర్ హీరోయిన్ రాధిక ఒక ఇంటర్వ్యూలో తెలపడం విశేషం.

ఎంత సంపాదించినా ఎంత ఎత్తుకు ఎదిగిన ఆమెను చివరి దశలో ఎవరు ఆదుకోలేదు అని అంటూ ఉంటారు.

తెలుగు సినిమాల విషయానికొచ్చేసరికి దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) ఎక్కువగా సుజాతను ప్రోత్సహిస్తూ ఉండేవారు.

సుజాత తన ఇంటి యజమాని అయిన హెన్రీ జయకర్ అనే వ్యక్తిని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది.

అక్కడ ఆమెకు వాతావరణం నచ్చకపోవడంతో డెలివరీ కోసం ఇండియాకి వచ్చి ఇక్కడే సెటిల్ అయింది తిరిగి భర్త దగ్గరికి వెళ్ళలేదు.

చివరగా ఆమె ఒంటరిగానే చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు.

కెనడా : రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయులు వీరే , ఇండియన్ కాన్సులేట్ సంతాపం