సరిత తో డబ్బింగ్ అంటే అంతలా భయపడేవారా ?

సరిత.500 లకు పైగా సినిమాలో నడిచి సౌత్ ఇండస్ట్రీ లో అన్ని భాషల్లో నటించిన హీరోయిన్ గా చరిత్ర సృష్టించడం మాత్రమే కాదు.

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా దాదాపు డజన్ల కొద్దీ ఆమె తోటి హీరోయిన్స్ డబ్బింగ్ చెప్తూ ఏకకాలంలో రెండు చేతుల సంపాదించింది.

ఆమె సినిమాల నుంచి నటిగా తప్పుకున్న తర్వాత సైతం ఆ తర్వాత జెనరేషన్ హీరోయిన్స్ కి కూడా ఆమె గాత్రదానం చేసింది.

రమ్యకృష్ణ, నగ్మా, సుష్మిత సేన్ వంటి నార్త్ ఇండియన్ హీరోయిన్స్ తో పాటు తెలుగు హీరోయిన్స్ కి కూడా ఆమె డబ్బింగ్ చెప్పింది .

ఆమె నటించిన సినిమాలతో డబ్బింగ్ కి కూడా ఆమె ఎన్నో అవార్డ్స్ ని దక్కించుకుంది.

సరిత సినిమాలతో సృష్టించిన సంచలనం కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాల బిజీ గా ఉండేది.

ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె ఎంతో బిజీ గా ఉన్న టైం లో ఆమె రెమ్యునరేష్ చుక్కల్లో ఉండేదట.

ఆమెతో డబ్బింగ్ చెప్పాలంటే పెద్ద బడ్జెట్ సినిమా మాత్రమే అయ్యి ఉండేదని అప్పట్లో వార్తలు హల్చల్ చేసాయి.

ఉదాహరణకు చిరంజీవి, సుహాసిని హీరో హీరోయిన్స్ గా నటించిన మంచు పల్లకి సినిమా లో సుహాసిని సొంతం డబ్బింగ్ చెప్పుకోలేదు.

తెలుగు అప్పటికి సుహాసిని కి రెండో సినిమా మాత్రమే కావడం తో రిస్క్ ఎందుకు అని దర్శకుడు వంశి అప్పట్లో ఫెమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా దుర్గ చేత చెప్పించాడు.

దుర్గ అప్పట్లో చాల మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేది.ఆమె వాయిస్ ఎంతో బాగా ఉన్నప్పటికీ అది సుహాసిని కి మ్యాచ్ అవ్వలేదు.

దాంతో వంశి ఆలోచనలో పడ్డాడు. """/"/ ఈ చిత్రానికి సుహాసిని వాయిస్ కి దుర్గ సరిపోలేదని ఫిక్స్ అయ్యాడు.

దాంతో యూనిట్ అంత కూడా ముక్త కంఠంతో సరిత అయితే బాగుంటుంది అని చెప్పారట.

ఈ సినిమా చిన్న బడ్జెట్ చిత్రమేమి కాకపోయినా సరిత పేరు చెప్పగానే వంశి భయపడ్డాడట.

ఎందుకంటే అప్పటికి ఆమె ఒక్కో సినిమాకు ఏకంగా డబ్బింగ్ కోసమే 10 వేలు తీసుకునేది.

అప్పుడు కేవలం 650 రూపాయలు నెలకు తీసుకునే వంశి సరిత రెమ్యునరేషన్ చూసి షాక్ అయ్యాడట.

అయినా కూడా నిర్మాత ఒప్పుకోవడం తో సరిత తో చెప్పించి విడుదల చేయగా సినిమా పర్వాలేదు అనిపించుకుంది.

వాట్సాప్ లో సరికొత్తగా ఫిల్టర్స్ ఫీచర్.. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..?