ఒక శివ భక్తుడి సినిమా కోసం బాపు అప్పట్లో ఇన్ని సాహసాలు చేసారా ?
TeluguStop.com
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా భక్తకన్నప్ప సినిమా( Bhakta Kannappa Movie ) గురించి వార్తలు వస్తున్నాయి అయితే మంచు విష్ణు( Manchu Vishnu ) చేస్తున్న భక్త కన్నప్ప సినిమా గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం.
కానీ గతంలో కృష్ణంరాజు( Krishnam Raju ) తీసిన ఆ సినిమా గురించి ఇప్పటి వరకు చాలా మందికి ఎలాంటి విషయం తెలియదు.
ఈ సినిమా గురించి చాలా అద్భుతాలు ఉన్నాయి అందులో కొన్ని ఖచ్చితంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భక్తకన్నప్ప సినిమా 1976 లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది.ఈ సినిమాను స్వయంగా కృష్ణంరాజు తన సొంత బ్యానర్ అయిన గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లోనే తెరకెక్కించారు.
ఇక ఎక్కువ శాతం ఈ చిత్రం అవుట్ డోర్ లోనే షూటింగ్ జరిగింది.
అప్పట్లో ఇంత భారీ మొత్తంలో అవుట్ డోర్ లో షూటింగ్ జరిగిన సినిమా గా భక్తకన్నప్ప రికార్డుకు ఎక్కింది.
అప్పట్లో జంగారెడ్డిగూడెంకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుట్టాయగూడెం అనే చోటులో కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణం లో అడవి ఉండేది.
ఆ అడవిలోనే ఈ సినిమా తీయడానికి అప్పట్లో బాపు రమణలు ఏర్పాటు చేస్తున్నారు.
అయితే అడవి అన్నాక ఏరు పారాలి కాబట్టి మోటార్లను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఏరుని పారించారు.
వందల్లో ఉన్న తాడి చెట్లను కూడా కొట్టించారు.అక్కడ 90 అడుగుల అమ్మవారి విగ్రహానికి ఒక సెట్ వేసి ఆశ్రమాన్ని కూడా నిర్మించారు.
"""/" /
ఆ అడవికి దారి లేకపోవడంతో దాదాపు 12 కిలోమీటర్ల దూరం రోడ్డు ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఈ రోడ్డు వేయడానికి, మిగతా సెట్టు పూర్తి చేయడానికి 45 రోజులు పట్టింది.
దీనికి గాను అప్పట్లోనే తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు.కేవలం పౌరాణిక సినిమాలకు 15 లక్షలకు మించి పెట్టని రోజుల్లో కృష్ణంరాజు 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
పైగా వారంలో ఆరు రోజులు మాత్రమే షూటింగ్ చేసి ఆదివారం విశ్రాంతి దినం గా గడిపేవారు.
ఆ రోజు అందరికి బిర్యాని తో విందు, వినోదాలు ఏర్పాటు చేసేవారట. """/" /
అలా 550 మందికి పైగా ఉన్న యూనిట్ మొత్తానికి భోజన వసతి ఇచ్చేవారట.
70 రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్లో ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి.
కండ గెలిచింది అనే పాటను ఎంతో భారీగా చిత్రీకరించాలనుకున్న బాపు( Bapu ) అప్పట్లో 45 డ్రమ్స్ తో ఒక సెట్ వేశారట.
దీనిని చేయడానికి 10 రోజులపాటు కష్టపడ్డారట.పాట పూర్తిగా తొమ్మిది నిమిషాల నిలిపి ఉంటుంది.
ఇలా ఎన్నో వింతలు విశేషాలు ఉన్న ఈ సినిమా విడుదల కృష్ణంరాజుకి కాసుల వర్షం కురిపించింది.
ఏపీలో ఆ మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇస్తారా.. తప్పు అస్సలు జరగదంటూ?