హీరోయిన్ నజ్రియా నజీమ్ గురించి మతిపోయే కొన్ని ఫ్యాక్ట్స్…!
TeluguStop.com
ఎక్స్‌ప్రెషన్ క్వీన్ నజ్రియా నజీమ్( Nazria Nazim ) "రాజా రాణి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది.
అట్లీ( Atlee ) డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిలింలో నజ్రియా అదిరిపోయే హావభావాలతో అందరినీ కట్టిపడేసింది.
ఈ మూవీలో ఆమె యాక్సిడెంట్ కారణంగా చనిపోతుంది.విశేషమేంటంటే, ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు కేవలం 29 ఏళ్లే.19 ఏళ్ల వయసులోనే మలయాళం స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్‌ను( Star Actor Fahad Fazil ) పెళ్లి చేసుకుంది.
వీరిద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.అలాగని వీరిది అరేంజ్డ్ మ్యారేజ్ ఏమీ కాదు.
లవ్ చేసుకునే పెళ్లి చేసుకున్నారు.ఈ క్యూట్ బ్యూటీ 2006 నుంచి 2010 వరకు మొత్తం మూడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది.
మాడ్ డాడ్ (2013) సినిమాతో హీరోయిన్‌గా మారింది.ఈ తార నాని హీరోగా వచ్చిన "అంటే సుందరానికి" సినిమాలో( Ante Sundaraniki ) హీరోయిన్ గా నటించి మెప్పించింది.
ఆమె ఫస్ట్ తెలుగు స్ట్రైట్ మూవీ ఇది.ఈ మూవీలో చేసినందుకుగాను నజ్రియా నజీమ్ రూ.
2 కోట్లు తీసుకుందని తెలిసింది. """/" /
ఇప్పుడు "సూక్ష్మదర్శిని" అనే ఒక మలయాళం సినిమా చేస్తోంది.
హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 12 ఏళ్లు అవుతున్నా నజ్రియా 15 కంటే ఎక్కువ సినిమాలు చేయలేదు.
ఎందుకంటే చాలా సెలెక్టివ్ గా ఉంటుంది.నచ్చితేనే సినిమా చేస్తుంది.
లేకపోతే సైలెంట్ అయిపోతుంది. """/" /
నజ్రియా కుంబళంగి నైట్స్, ఆవేశం ( Kumbalangi Nights , Avasham )వంటి కొన్ని సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసింది.
2005 నుంచి 2013 దాకా టీవీ షోస్ కు హోస్ట్ గా పనిచేస్తూ అలరించింది.
నజ్రియా చిలిపి పాత్రలతో 'పక్కింటి అమ్మాయి'గా గుర్తింపు తెచ్చుకుంది."కేరళస్ స్వీట్‌హార్ట్"గా కూడా ముద్దు పేరు తెచ్చుకుంది.
2013 కొచ్చి టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో 5వ స్థానంలో నిలిచింది.
2018, 2019, 2020లో 3వ స్థానంలో నిలిచింది."ఓం శాంతి ఓషానా", "బెంగళూరు డేస్"లో ఆమె చేసిన పాత్రలు మలయాళ సినిమాలో మోస్ట్ స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్‌గా నిలిచాయి.
ఈ క్యూట్ బ్యూటీ ఆస్తి విలువ రూ.16 లక్షలు అని అంచనా.
ఈ నటికి నవీన్ నజీమ్ అనే సోదరుడు ఉన్నాడు.ఆమె కుటుంబం ఒకప్పుడు యూఏఈలోని అల్ ఐన్‌లో నివసించింది.
తర్వాత త్రివేండ్రం సిటీకి షిఫ్ట్ అయ్యారు.
మనోళ్లు ఎవరో అర్థమైందా బన్నీ.. ఇప్పటికైనా ఆ తప్పులు అస్సలు చేయొద్దంటూ?