Akkineni Nageswara Rao: నాతో సినిమా అంటే ఎవరైనా హైదరాబాద్ రావాల్సిందే : అక్కినేని

అక్కినేని వంద సంవత్సరాల వేడుక నేడు అట్టహాసం గా జరుగుతుంది.ఈ సందర్భంగా ఆయన గురించి అనేక విషయాలు సోషల్ మీడియా సాక్షిగా ఆయన అభిమానులు పంచుకుంటున్నారు.

ఇక అక్కినేని( Akkineni Nageswara Rao ) లాంటి ఒక అందగాడు, పాటగాడు, ఆటగాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మళ్లీ పుట్టలేదు అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

ఆయనతో సినిమా తీయాలంటే ఎవరైనా సరే హైదరాబాద్ కి( Hyderabad ) రావాల్సిందే అంటూ హుకుం జారీ చేసిన మొనగాడు కూడా కేవలం అక్కినేని మాత్రమే.

తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలోనే షూటింగ్స్ జరుపుకున్న సమయంలో తాను మాత్రమే ఎన్టీఆర్ తో కలిసి ముందుగా హైదరాబాద్ కి విచ్చేశాడు.

"""/" / అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తో మంతనాలు జరిపి తనకు జూబ్లీహిల్స్ లో 7 ఎకరాల స్థలాన్ని కేటాయించుకునేలా చేసుకుని అక్కడ అన్నపూర్ణ స్టూడియో( Annapurna Studios ) కట్టి తన స్టూడియోలోనే తన సినిమాలు ఇకపై షూటింగ్ జరుపుకుంటాం అని, ఎవరైనా సరే ఏ దర్శకుడైన సరే చెన్నై నుంచి హైదరాబాద్ కు రావాల్సిందే అని పట్టుబట్టాడు.

దాంతో దిక్కు తోచని పరిస్థితులలో కొంతమంది ఆయనను వెతుక్కుంటూ హైదరాబాద్ కి వచ్చేసారు.

ఆ వెంటనే మిగతా ఇండస్ట్రీ మొత్తం చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ చేయబడింది.

అలా హైదరాబాద్ కి ఒకసారి కొత్త కలను తీసుకొచ్చిన వ్యక్తి అక్కినేని. """/" / కేవలం సినిమాలు తీసామా జేబులు నింపుకున్నామా అన్నట్టుగా ఉండే టాలీవుడ్ హీరోలలో అక్కినేని పూర్తిగా భిన్నమైన వ్యక్తి.

సినిమా అంటే సామాజిక బాధ్యత అని నమ్మిన వ్యక్తి.వయసు పైబడిన తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని మళ్ళీ సినిమాలలో బిజీ అయ్యాడు.

93 ఏళ్ల వయసులో కూడా మనం( Manam Movie ) వంటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించ గలిగాడు.

తనకు క్యాన్సర్ సోకగానే ఎవరు ఎలాంటి అవాకులు చవాకులు మాట్లాడుతారో అని ముందే ఊహించి దాని త్వరలోనే చనిపోబోతున్నాను.

ఇది అందరి జీవితంలో జరిగేదే అంటూ ఖచ్చితంగా చెప్పగలిగిన వ్యక్తి కూడా అక్కినేని మాత్రమే.

వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!