Shouryuv : హాయ్ నాన్న మూవీ డైరెక్టర్ ఇంతకుముందు ఏం చేసేవాడో తెలుసా.?

నేచురల్ స్టార్ నాని "హాయ్ నాన్న( Hi Nanna )" సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు.

హైలీ ఎమోషనల్ డ్రామాగా రిలీజ్ అయిన ఈ సినిమా చాలామందిని ఆకట్టుకుంది.తండ్రి కూతుర్ల మధ్య బాండ్ ఎలా ఉంటుందో ఈ మూవీలో కళ్ళకు కట్టినట్టు చూపించారు.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మూవీ సూపర్ అని అంటున్నారు.అందుకే దీనికి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు.

ఎమోషనల్ సీన్స్ కంటతడి కూడా పెట్టించాయట.నాని యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని కూడా చాలామంది పొగుడుతున్నారు.

మంచి పాజిటివ్ టాక్ తో ఈ సినిమా హిట్ దిశగా దూసుకు వెళ్తుంది.

ఇంత మంచి మూవీ తీసిన దర్శకుడు శౌర్యువ్( Shouryuv ) ఎవరో తెలుసుకునేందుకు చాలామంది ప్రేక్షకులు ఆరాధిస్తున్నారు.

మరి ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో మనమూ తెలుసుకుందామా. """/" / నిజానికి శౌర్యువ్‌కు హాయ్ నాన్న ఫస్ట్ మూవీ.

అయినా అతని ఆ సినిమాను చాలా అనుభవం ఉన్న దర్శకులతో సమానంగా చేశాడు.

ఇంకో ఆసక్తికర వాస్తవం ఏంటంటే, శౌర్యువ్ మూవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆల్రెడీ ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి.

మొదటగా అతను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) వద్ద అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేశాడు.

"""/" / జాగ్వార్, బజరంగీ భాయిజాన్ 2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు ఈ దర్శకుడు సహాయక రచయితగా వర్క్ చేసే ఎంతో అనుభవాన్ని సంపాదించాడు.

అంతేకాదు ఒక బాలీవుడ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి డైరెక్షనల్ స్కిల్స్ కూడా నేర్చుకున్నాడు.

తమిళ అర్జున్ రెడ్డి ఆదిత్య వర్మ సినిమా కోసం కూడా పనిచేశాడు.బాగా ఎక్స్‌పీరియన్స్ లభించిన తర్వాత సొంతంగా స్టోరీస్ రాసుకోవడం మొదలుపెట్టాడు.

లక్కీగా అదే సమయంలో ప్రొడ్యూసర్స్ ఇతడిని కలిశారు.వారికి సినిమా కథ వినిపించగా ఫిదా అయ్యారట.

అందుకే ఈ మూవీ ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రాగలిగిందని చెబుతున్నారు.ఏది ఏమైనా తొలి సినిమా తోనే హిట్టు కొట్టి అందరి దృష్టిలో పడ్డాడు ఈ కొత్త డైరెక్టర్.

ఈ సినిమా వల్ల అతను స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలను త్వరగా దక్కించుకోవచ్చు.

నెక్స్ట్ సినిమాతో కూడా అతడు ఒక హిట్ కొడితే కెరీర్ లో తిరుగు ఉండదు.

అదే జరగాలని మనం కూడా ఆశిద్దాం.

ఈ టాలీవుడ్ హీరోయిన్స్ అందరికి పిలిచి మరి అవకాశం ఇచ్చారు !