ఆమె ఓ అందాల సితార… భారతీయ తెరపై ఆమె గీసిన ‘రేఖ’ చెరిగిపోదు ఎప్పటికీ!
TeluguStop.com
అవును, మీరు విన్నది ముమ్మాటికీ నిజం.90లో భారతీయ సినిమాని ఓ ఊపు ఊపేసిన ఆమె అందం ఇప్పటికీ చెక్కు చెదరకుండా సజీవంగా ఉందనే చెప్పుకోవచ్చు.
అందుకే ఆమెని ఓ హిందీ కవి విభ్రమ అని అన్నారు.అంటే, ఆమె ఒక అందమైన మాయ అని అర్ధం.
సాధారణముగా మహిళలకు 70 ఏళ్లు వచ్చాయంటే చాలు, ఇక వారు బామ్మలు, మామ్మలు అయిపోవాల్సిందే.
మొహంపై ముడతలు, కాళ్ల నొప్పులు, ఆయాసం, అనారోగ్యం అన్నీ చుట్టుముట్టి మరణానికి చేరువలో ఉంటారు.
కానీ ఆమె అందరికీ అతీతమైన వ్యక్తి.ఆమె వయస్సు నేటికి 69 ఏళ్ళు.
మరి అమృతం తాగిందో ఏమో గానీ, ఆమె వయస్సు ఎక్కడో ఆగిపోయింది.ఇక ఈ వయస్సులో కూడా అనార్కలి డ్రెస్ వేసుకుని, అబూదాబిలో జరిగిన సినిమా అవార్డుల ఐఫా( IIFA ) వేదిక మీద ఆమె దాదాపు 20 నిమిషాలపాటు తోటి డాన్సర్లకు దీటుగా నాట్యం చేసింది అంటే మీరు నమ్మగలుగుతారా? """/" /
ఆమె మరెవ్వరో కాదు, బాలీవుడ్ అందాల సితార 'రేఖ.
'( Rekha ) రేఖ భారతీయ చలన చిత్ర రంగంలో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా గుర్తింపు సాధించింది.
దాదాపుగా 200 చిత్రాలలో నటించి, ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా, ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రశంసలను అందుకుంది.
ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఆమెను 2010లో భారతదేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో( Padma Shree ) గౌరవంగా సత్కరించింది.
రేఖ ప్రముఖ నటులు పుష్పవల్లి, జెమినీ గణేశన్ ల కుమార్తె అని చాలామందికి తెలియదు.
ఆమె రంగుల రాట్నం (1966) సినిమాతో బాల నటిగా తన సినిమా కెరీర్ని ప్రారంభించింది.
ఈ క్రమంలో కన్నడ చిత్రం ఆపరేషన్ జాక్‌పాట్ నల్లి C.I.
D 999 (1969)తో ఆమె కథానాయికగా మొదటి చిత్రంలో మెరిసింది. """/" /
ఇక ఆ తరువాత రేఖ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఆమె అందం, అభినయానికి భారతీయ చలన చిత్ర పరిశ్రమల్లో వివిధ భాషల్లో నటిస్తూ తన సత్తాని చాటింది.
అయితే ఎక్కువ శాతం బాలీవుడ్లోనే నటించిందని చెప్పుకోవాలి.ఈ నేపథ్యంలోనే హిందీ సినిమా ప్రముఖ తారలలో ఒకరుగా పేరుగడించారు.
ఖుబ్సూరత్ (1980)లో( Khubsoorat ) ఆమె నటనకు ఉత్తమ నటిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.
ఇక ఉమ్రావ్ జాన్ (1981)లో ఆమె ఒక వేశ్య పాత్రను పోషించడం వలన ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.
ఇలా చెప్పుకుంటూ పోతే రేఖ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు.అయితే తాజాగా ఆమె ఐఫా వేడుకలలో ఏదో 30, 40 వయస్సులో ఉన్నట్టుగా, చురుకుగా, ఉత్సాహంగా డాన్సులు వేసేసరికి అబుదాబి స్టేడియం దద్దరిల్లిపోయింది.
దాంతో సోషల్ మీడియా జనాలు రేఖ అందచందాలు, డాన్సులు గురించే మాట్లాడుకుంటున్నారు.
పుష్ప సీక్వెల్ లో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!