Suman Shetty : నటించిన మొదటి సినిమాతోనే నంది అవార్డ్ గెలిచిన ఈ కమెడియన్ గురించి మీకు తెలుసా?

క్రికెట్ లో ఆడిన మొదటి బంతికే సిక్సర్ కొడితే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి లేదా వేసిన మొదటి బంతికే వికట్ పడితే మరింత ఆనందంగా ఉంటుంది అలాంటి పరిస్థితి సినిమా ఇండస్ట్రీకి కూడా అనువదించుకోవచ్చు.

నటించిన మొదటి సినిమాతోనే నంది అవార్డు లేదా నేషనల్ అవార్డు సంపాదిస్తే ఆ ఆనందం వెలకట్టలేనిది.

అలాంటి అవకాశం అందరి నటీనటులకు దక్కదు.అలా దక్కాలి అంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలి.

అంతకు మించిన నటించగలిగే సత్తా కూడా ఉండి తీరాలి.అలా నటించిన మొట్టమొదటి సినిమాతోనే నంది అవార్డు( Nandi Award ) గెలిచిన కమెడియన్ గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / ఆ కమెడియన్ మరెవరో కాదు సుమన్ శెట్టి( Suman Shetty ).

అతడు నటించిన మొట్టమొదటి సినిమా తేజ దర్శకత్వంలో నితిన్ మరియు సదా హీరో హీరోయిన్స్ గారి నటించిన జయం.

ఈ సినిమాలో నితిన్ కి స్నేహితుడిగా కామెడీని పండించే పాత్రలో సుమన్ శెట్టి అద్భుతంగా నటించాడు.

అందుకు గాను ఆ సంవత్సరం నంది అవార్డ్స్ ప్రకటించిన సమయంలో ప్రభుత్వం ఈ చిత్రానికి కూడా బెస్ట్ కమెడియన్ గా సుమన్ శెట్టి కి అవార్డు ఇచ్చింది.

2002 లో జయం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత 7/G బృందావన్ కాలనీ, యజ్ఞం వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

"""/" / ప్రస్తుతం ఈ 46 ఏళ్ల కమీడియన్ తన సినిమాల జోరు కాస్త తగ్గించినప్పటికీ అడపా దడపా కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.

2023 వ సంవత్సరంలో నాతో నేను అనే ఒక చిన్న సినిమాలో కమెడియన్ గా నటించాడు.

మిర్యాల గూడ వాస్తవ్యుడైన( Miryalaguda ) కమెడియన్ సుమన్ శెట్టి లోని టాలెంట్ ని రైటర్ సత్యానంద్ గుర్తించి బయటకు తీసుకువచ్చారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో కాకుండా వైజాగ్ లో తన కుటుంబంతో ఉంటున్నటువంటి సుమన్ ఏదైనా అవకాశాలు ఉంటే వచ్చి నటించి వెళ్ళిపోతున్నాడు.

నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?