‘అప్పల రాజు’..‘రాజబాబు’ ఎలా అయ్యాడో మీకు తెలుసా? 

ఆంధ్రప్రదేశ్‌లోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నర్సాపురంలో 1935వ సంవత్సరంలో అక్టోబర్ 20న పుట్టాడు ఉమామహేశ్వరరావు,రవణమ్మ దంపతులకు మగ పిల్లాడు పుట్టాడు.

అప్పుడు ఆ ఊరికి కాని ఆ జిల్లాకు కాని తెలియదు ఆ తర్వాత కాలంలో ఆ పిల్లాడు తెలుగు సినిమా హాస్య చక్రవర్తి అవుతాడని, కానీ, అదే జరిగింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్యపు రారాజు అయ్యాడు ఆ పిల్లాడు.అయితే, అప్పుడు తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు ‘పుణ్యమూర్తుల అప్పలరాజు’.

అటువంటి ‘అప్పలరాజు’ రాజబాబు’ ఎలా అయ్యాడంటే.పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు పాఠశాలలో చదువుకునే టైంలోనే అప్పలరాజు నాటకాలలో వేషాలు వేసేవాడు.

అలా నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్న అప్పల రాజు లక్ష్మీ అమ్ములును పెళ్లి చేసుకున్నాడు.

ఆ తర్వాత కాలంలో ‘పుట్టిల్లు’ చిత్ర దర్శకుడు గరికపాటి రాజారావు ఓ సారి అప్పలరాజు నాటకం వేస్తుండగా చూసి సినిమాలలో ట్రై చేయాలని సూచించాడు.

దాంతో ఇంట్లో చెప్పకుండానే అప్పలరాజు మద్రాసు బయలుదేరి వచ్చాడు.అలా మద్రాసు వచ్చిన అప్పల రాజు అడ్యాల నారాయణరావు సినిమాలో ఓ పాత్ర పోషించాడు.

అలా సినిమా అవకాశాలు అప్పలరాజును వెతుక్కుంటూ వచ్చాయి.అలా స్క్రీన్‌పైన అప్పలరాజు పేరు కాస్తా ‘రాజబాబు’గా మారిపోయింది.

"""/"/ రాజబాబు ‘స్వర్ణగౌరి’ మూవీకిగాను రూ.350 రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడు.

నిజానికి రాజబాబుకు తన గురువు అచ్యుత రామయ్య దగ్గర నేర్చుకున్న బుర్రకథ నాటకాల వేషాలు ఉపయోగపడ్డాయట.

పాఠశాలలో చదువుతున్న సమయంలోనే రాజబాబు అచ్యుత రామయ్య వద్ద నాటకాలలో వేషాలు వేసేవాడు.

అలా డైలాగ్ పట్ల డిక్షన్, నటనా చాతుర్యం, ప్రతిభ ఎంతో కొంత అలవడి ఉండొచ్చు.

ఇక అప్పటి చిత్రాల్లో రాజబాబు, రమాప్రభ జోడీకి హాస్య జంటగా మంచి పేరున్న సంగతి అందరికీ విదితమే.

వీరిరువురు కలిసి ఓ సినిమాలో నటిస్తే చాలు.అది హిట్ కావాల్సిందే అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.

ఇక రాజబాబు ‘తిరుపతి, తాతామనవడు, పిచ్చోడి పెళ్లి, మనిషి రోడ్డున పడ్డాడు, ఎవరికి వారే యమునా తీరే’ చిత్రాల్లో కథనాయకుడిగా కూడా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.

టాప్ కమెడియన్‌గా ఉండి హీరోగా కూడా ఎదిగాడు రాజబాబు.

Victory Venkatesh : వెంకటేష్ చేసిన ఆ సినిమా అంటే ఈ స్టార్ హీరో కి చాలా ఇష్టమట…ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?