కన్నీళ్లు పెట్టిస్తున్న నర్తనశాల ఆర్ట్ డైరెక్టర్ కథ !

ఏది ఏమైనా పురాణాలపై సినిమాలు తీయాలంటే ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ తర్వాతే ఎవరైనా ఉంటారని చెప్పాలి.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఈ రకమైన కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి.

ఆది పురుష్ సినిమాలో ఉన్న లోపాలు మన తెలుగు సినిమా దర్శకుల యొక్క గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చేలా ఉన్నాయి.

పైగా ఇప్పటి వరకు ఎంతో మంది చెప్పినా రామాయణాన్ని పూర్తి వక్రీకరణతో తీయడం కేవలం నార్త్ డైరెక్టర్ అయిన ఓంరౌత్( Omraut ) కె చెల్లింది.

సరే కాసేపు ప్రభాస్ ఆదిపురుష్ సంగతి పక్కన పెడితే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆర్ట్ డైరెక్టర్ యొక్క కన్నీటి కథ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

"""/" / అది 1963 .దర్శకుడు కమలాకర కామేశ్వర రావు( Director Kamalakara Kameswara Rao ) నర్తనశాల ( Nartanashala )అనే ఒక సినిమా తీశారు.

ఇది పురాణాలను ఆధారం చేసుకుని తీసిన సినిమా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి వంటి మహానటులు నటించగా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా అవార్డులకు కొదవ లేకుండా పోయింది.అప్పట్లో జకార్తలో జరిగిన ఆఫ్రో ఏషియన్ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవంలో నర్తనశాల సినిమాను సైతం ప్రదర్శనకు పెట్టారు.

అంతేకాదు ఆ ప్రదర్శనలోని కొన్ని సినిమాలకు అవార్డులను కూడా బహుకరించారు.ఆ సందర్భంగా నర్తనశాల సినిమాలో కీచకుడు పాత్రలో నటించిన ఎస్వీ రంగారావు( SV Ranga Rao ) కి ఉత్తమ నటుడిగా అవార్డు సైతం ఇచ్చారు.

అంతేకాదు ఆ సినిమా కోసం పని చేసినటువంటి ఆర్ట్ డైరెక్టర్ అయిన శర్మ గారికి సైతం ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అవార్డును బహుకరించారు.

ఇలా ఒక ఇంటర్నేషనల్ వేదికపై ఒకే చిత్రానికి చెందిన ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉత్తమ క్యాటగిరి అవార్డులు అందుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.

"""/" / ఈ సంఘటన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ శర్మ( Art Director Sharma ) గారికి మద్రాసులో ఘనంగా సన్మానం కూడా చేశారు.

అందరూ ఆయన చేసిన కృషిని, సినిమా కోసం ఆయన పడిన కష్టాన్ని పొగుడుతూ వచ్చారు.

అలాగే శర్మ గారు కూడా మాట్లాడారు.ఈరోజు నాకు ఇంత పెద్ద సన్మానం, ఈ స్థితి రావడానికి ఎంతో మంది కారణమయ్యారు.

వారందరికీ నా రెండు చేతులతో నమస్కరించాలని ఉన్నా కూడా ఆ పని చేయలేకపోవడం నన్ను ఎంతగానో బాధపెడుతుంది అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

ఎందుకంటే ఆయనకు ఒక్క చెయ్యి మాత్రమే ఉంది ఆయన తన ఒంటిచేతను ఎన్నో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు.

అది మరి వృత్తి పట్ల నిబద్ధత అంటే.

వైరల్ వీడియో: మెట్రోలో ” నాటు.. నాటు.. ” రెచ్చిపోయిన యువకుడు..