లావుగా ఉన్నా మాలీవుడ్‌ని దున్నేస్తున్న అపర్ణ.. వీరి టేస్ట్ వెరీ డిఫరెంట్.

మాలీవుడ్ సినిమాలు( Mollywood Movies ) ఎక్కువగా కంటెంట్ మీదనే ఆధారపడి తెరకెక్కుతుంటాయి.

ఈ సినిమాల్లో హీరో హీరోయిన్ల గ్లామర్ పండించడం, లేదంటే రొమాంటిక్ సన్నివేశాలను ఎక్కువగా చూపించడం చేయరు.

చెత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ధోరణి మలయాళ సినీ దర్శక నిర్మాతలలో ఏమాత్రం కనిపించదు.

కేవలం కథ బాగుండేలాగా మాత్రమే చూసుకుంటారు.హీరోయిన్ అందంగా ఉండాలని, నాజూగ్గా కనిపించాలని అసలు ఆశించరు.

ఉదాహరణకు "ఆకాశం నీ హద్దురా" హీరోయిన్ అపర్ణ బాలమురళి ( Aparna Balamurali )గురించి చెప్పుకోవచ్చు.

వయసు 28 ఏళ్ళే కానీ ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా తయారైంది. """/" / ఇలా లావుగా తయారైన వారిని టాలీవుడ్ అంటే ఈ సినిమా ఇండస్ట్రీ వారు అసలు తీసుకోరు.

అందుకే నాజుగ్గా కనపడటానికి తెలుగులో హీరోయిన్లు బాగానే కష్టపడుతుంటారు.కానీ అపర్ణ బాలమురళి మాత్రం "నా బాడీ నా ఇష్టం, దర్శక నిర్మాతలకు ఏమీ అభ్యంతరం లేనప్పుడు మధ్యలో మీకేంటి" అన్నట్లు నిత్యామీనన్ రేంజ్ లో మాట్లాడుతోంది.

నిజానికి ఆమె టాలెంట్ చూసి మలయాళ సినిమాల్లో బాగానే అవకాశాలు వస్తున్నాయి.2022లో ఐదు సినిమాలు చేసింది.

2023లో ఆమె యాక్ట్ చేసిన నాలుగు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి.ఇంకొక మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

ఈ సంవత్సరం ఇంకొక కొత్త సినిమాకి కూడా ఆమె సైన్ చేసింది.మొత్తం ఐదు సినిమాలు ఆమె చేతిలో ఇప్పుడు ఉన్నాయని చెప్పుకోవచ్చు.

"""/" / హీరోయిన్ శరీర బరువు, లావుతో సంబంధం లేకుండా డిఫరెంట్ కంటెంట్ ఎంచుకోవడంలోనే మలయాళ ఇండస్ట్రీ ఆసక్తి చూపిస్తుందనడానికి అపర్ణ బాలమురళి సినిమాలను నిదర్శనంగా చూపెట్టవచ్చు.

ఇటీవల తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో అదృశం అనే ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయింది.

అందులో అపర్ణ చాలా లావుగా ఉంది.తెలుగులో అయితే ఇంత లావు ఉన్న అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోరు.

దీని ఆధారంగా మలయాళ ఇండస్ట్రీ టేస్ట్ చాలా డిఫరెంట్ అని అర్థం చేసుకోవచ్చు.

ఇక అదృశ్యం సినిమా( Adrushyam Movie ) ఒక థ్రిల్లర్ క్రైమ్ డ్రామా.

ఇందులో హీరోయిన్ ఒక హత్య కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.కథ ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చాలా స్ట్రైట్ గా బోర్ కొట్టకుండా సాగుతుంది.

ఈ మూవీలో అపర్ణ యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

ఈ ఇద్దరి చేతిలో దెబ్బలు తిన్న నాగార్జున.. పనులు చేయకపోతే అలా బిహేవ్ చేసేవారా?