అమెరికాలో తుపాకీ రాజ్యానికి అసలు కారణం ఏంటో తెలుసా...!!!
TeluguStop.com
అగ్ర రాజ్యం అమెరికాను పట్టి పీడించే అతిపెద్ద సమస్య, కరోనా కంటే అతి భయంకరమైన సమస్య గన్ కల్చర్.
ఈ సమస్య ఏళ్ళ తరబడి కొనసాగుతూనే ఉంది.రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది తప్ప ఈ సమస్యకు పరిష్కారం మాత్రం ఇప్పటికి దొరకక పోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా అగ్ర రాజ్యం తలుచుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకడం పెద్ద విషయమేమీ కాదు.
కానీ అమెరికాలో గన్ కల్చర్ ఎందుకు ఇంతగా వేళ్ళూరుకు పోయింది.అందుకు రీజన్ ఏంటి.
అనే వివరాలలోకి వెళ్తే.అమెరికాలో సగటున రోజుకు సుమారు 50 మందికి పైగా ప్రజలు తుపాకీకి బలై పోతున్నారు.
అంతేకాదు దాదాపు 58 శాతం మంది ప్రజలు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో తుపాకీ బెదిరింపులకు గురయిన వారేనట.
ఉగ్రవాదుల దాడిలో చనిపోయే వారికంటే కూడా దేశంలో అమలవుతున్న తుపాకీ సంస్కృతికి బలైపోయే వారు దాదాపు 3 రెట్లు ఎక్కువట.
ఇంత జరుగుతున్నా అక్కడ విచ్చలవిడిగా తుపాకులను సంతలో కూరలు అమ్మినట్టు అమ్మేయడానికి కారణం ఏంటంటే.
ప్రజలలో కొరవడుతున్న అవగాహనా లోపమే అంటున్నారు నిపుణులు. """/"/
తుపాకులను వాడటం, అమ్మడం విషయంలో అక్కడి ప్రజలు రెండు గా చీలిపోయారు.
గన్ కల్చర్ పై నియంత్రణ తీవ్రంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య 50 శాతం ఉండగా, దాదాపు 30 శాతం మంది ప్రజలు గన్ కల్చర్ పై ఇప్పుడు ఉన్న స్వేచ్చ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నారట.
ఇక 20 శాతం మంది ప్రజలు గన్ కల్చర్ పై ఇప్పుడు ఉన్న నిబంధనలు కూడా పూర్తిగా తొలిగించి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని కోరుతున్నారట.
అంటే దాదాపు 50 శాతం మంది ప్రజలు గన్ కల్చర్ కు అనుకూలంగా ఉన్నారు.
గన్ కల్చర్ వలన కలిగే నష్టం గురించి ప్రజలలో అవగాహన కలిగినపుడు మాత్రమే గన్ కల్చర్ ను నియంత్రించగలమని అప్పటి వరకూ ఇప్పటి పరిస్థితి ఇలానే కొనసాగుతుందని తుపాకీ నియంత్రణ స్వచ్చంద సంస్థలు అంటున్నాయి.
ప్రశాంత్ నీల్ ఆ సినిమా చేస్తే చూడాలని ఉంది అంటున్న నెటిజన్లు…ఇంతకీ ఈ సినిమా..